ETV Bharat / bharat

Best Post Office Schemes With High Savings: పొదుపు కోసం ఏ పోస్టాఫీస్ పథకం మంచిది.. మీకు తెలుసా? - కిసాన్ వికాస్ పత్ర

Which Post Office Scheme Is Best For Savings: మీరు భారతీయ పోస్ట్ ఆఫీసుల్లో డబ్బును పొదుపు చేయాలని అనుకుంటున్నారా..? మరి, అందులో బెస్ట్ సేవింగ్ స్కీమ్‌లు ఏమున్నాయో మీకు తెలుసా? ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకోండి.

Which Post Office Scheme Is Best For Savings
Best Post Office Schemes With High Saving
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2023, 10:33 AM IST

Which Post Office Scheme Is Best For Savings: భారతీయ పోస్ట్ ఆఫీసుల్లో డబ్బును పొదుపు చేయాలని.. స్కీమ్‌ల కోసం వెతుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఓ కీలక విషయాన్ని తెలియజేసింది. ఉత్తమ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్‌ల (2023) జాబితాను ప్రకటించింది. దాంతోపాటు పోస్ట్ ఆఫీస్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్, స్కీమ్‌ల పేర్లు, వాటి రకాలు, వడ్డీ రేట్ల వివరాలు, పన్ను ప్రయోజనాలు వంటి వివరాలను కూడా వెల్లడించింది. మరీ ఆ స్కీమ్‌ల పేర్లేంటి..?, ఎన్ని రకాల పోస్ట్ ఆఫీసు సేవింగ్ స్కీమ్‌లు ఉన్నాయి..?, వాటికి ఎలా దరఖాస్తు చేయాలి..? అనే వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

భారతీయ తపాలా శాఖలో 10 రకాల ఆర్థిక పథకాలు ఉన్నాయి..
10 Types of Financial Schemes in The Department of Posts: భారతీయ తపాలా శాఖ మొత్తం 10 రకాల ఆర్థిక పథకాలను రూపొందించింది. అందులో కొన్ని మహిళల కోసం, మరికొన్ని పిల్లల కోసం, ఇంకొన్ని వృద్ధుల కోసం రూపొందించబడ్డాయి. మొదటిది.. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా (SB), రెండవది.. నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ ఖాతా (RD), మూడవది.. నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ ఖాతా (TD), నాల్గవది.. జాతీయ పొదుపు నెలవారీ ఆదాయ ఖాతా (MIS), ఐదవది.. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఖాతా (SCSS), ఆరవది.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా (PPF), ఏడవది.. సుకన్య సమృద్ధి ఖాతా (SSA), ఎనిమిదవది.. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు (NSC), తొమ్మిదవది.. కిసాన్ వికాస్ పత్ర (KVP), పదవది.. పిల్లల కోసం PM కేర్స్ పథకం (2021). వీటి గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.

1. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా (SB)
Post Office Savings Account (SB): పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా (SB) అనేది రిటైల్ బ్యాంక్ అందించే పొదుపు ఖాతా పథకం. ఈ పథకం ద్వారా కనీస డిపాజిట్ రూ.500 నుంచి కనిష్టంగా రూ.50 వరకూ డిపాజిట్ చేయొచ్చు. ఈ పథకం కింద 4శాతం వడ్డీ రేటు అందిస్తుంది. ఈ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాను పెద్దలు, మైనర్లు ఇద్దరూ తెరవవచ్చు. గరిష్ట పెట్టుబడి రూ.10,000 వరకు ఉంటుంది. ఎటువంటి పన్ను మినహాయింపు ఉండదు.

2. నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ ఖాతా (RD)
National Savings Recurring Deposit Account (RD): సామాన్యులు సైతం ఉపయోగించగల పోస్టాఫీసు పొదుపు ప్రోగ్రామ్‌లలో నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ ఖాతా (RD) ఒకటి. దీనికి కనీస నెలవారీ డిపాజిట్ రూ.100గా ఉంటుంది. వార్షిక వడ్డీ రేటు 5.8శాతంగా ఉంటుంది.

3. నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ ఖాతా (TD)
National Savings Time Deposit Account (TD): నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ ఖాతా (TD) పథకం అనేది గరిష్ట పెట్టుబడి పరిమితులు లేని పదవీకాల ఆధారిత ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా ఇది. ఈ పథకంలో కనీసం రూ.1,000 పెట్టుబడి పెట్టాలి. ఐదు సంవత్సరాల కాలానికి ఈ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ప్లాన్ కింద 6.7శాతం వడ్డీ రేటు లభిస్తుంది.

4. జాతీయ పొదుపు నెలవారీ ఆదాయ ఖాతా (MIS)
National Savings Monthly Income Account (MIS): నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్ (MIS) అనే ఈ పథకం ద్వారా 6.6శాతం వడ్డీ రేటును అందిస్తారు. ఇది అతి చిన్న పెట్టుబడి పథకం. కనిష్టంగా రూ.1,000 నుంచి గరిష్టంగా 4.5 లక్షలు, ఉమ్మడిగా 9 లక్షల వరకూ డిపాజిట్ చేయొచ్చు.

5. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఖాతా (SCSS)
Senior Citizens Savings Scheme Account (SCSS): 60 ఏళ్లు పైబడిన ఎవరైనా పోస్టాఫీసు ద్వారా ఈ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఖాతా (SCSS) తెరవవచ్చు. అయితే, ఈ పథకానికి 55 ఏళ్లు పైబడి, పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు గానీ, 50 ఏళ్లు పైబడిన రిటైర్డ్ సైనిక సిబ్బందికి గానీ అనుమతి లేదు. అవసరమైన కనీస పెట్టుబడి రూ.1000 నుంచి గరిష్టంగా రూ.15 లక్షల వరకూ పెట్టుబడి పెటొచ్చు. ఈ పథకం కింద 7.4శాతం వడ్డీ రేటు అందించబడుతుంది.

6. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా (PPF)
Public Provident Fund Account (PPF).. ఈ పథకం కింద భారతీయ పెద్దలు రూ.500 డిపాజిట్‌తో ఖాతాను తెరవవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరానికి గరిష్టంగా రూ.1.5 లక్షల డిపాజిట్ ఉంటుంది. PPF ఖాతా కింద 7.1శాతం వడ్డీ రేటు అందిస్తారు.

7. సుకన్య సమృద్ధి ఖాతా (SSA)
Sukanya Samriddhi Account (SSA): సుకన్య సమృద్ధి ఖాతా (SSA) అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం యువతులకు సాధికారత కల్పించేందుకు ఈ పథకం రూపొందించింది. ఈ పథకం ద్వారా తల్లిదండ్రులు తమ కుమార్తెల భవిష్యత్తును సురక్షితంగా ఉంచేలా ప్రోత్సహించేందుకు 'బేటీ బచావో, బేటీ పడావో' కింద 2015లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 7.6 శాతం వడ్డీ రేటు అందిస్తారు. కనిష్టంగా రూ. 250 నుంచి ఒక ఆర్థిక సంవత్సరానికి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టొచ్చు.

8. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు (NSC)
National Savings Certificates (NSC): భారతీయులలో పొదుపు అలవాటును ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా కనీస పెట్టుబడి రూ.100గా ఉంటుంది. గరిష్టంగా పరిమితి లేదు. ప్రస్తుత వడ్డీ రేటు 6.8శాతంగా అందించబడుతుంది.

9. కిసాన్ వికాస్ పత్ర (KVP)
Kisan Vikas Patra (KVP): ఈ పథకం ద్వారా ప్రజలు దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం ద్వారా వినియోగదారులకు కెవిపి సర్టిఫికేట్‌ను అందిస్తారు. ప్రస్తుతం అందిస్తున్న వడ్డీ రేటు 6.9 శాతంగా ఉంది. ఈ పథకంలో పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు.

10. పిల్లల కోసం PM కేర్స్ పథకం (2021)
PM Cares Scheme for Children (2021): COVID-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం 'పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రెన్ స్కీమ్‌ను' ప్రవేశపెట్టింది. మే 29, 2021న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ స్కీమ్‌ను లాంచ్ చేశారు. పిల్లల పేరు మీద ఖాతా తెరవబడుతుంది. ప్రతి నెలా పీఎం కేర్ ఫండ్ నుండి ఒకేసారి చెల్లింపు జరుగుతుంది. లబ్ధిదారుడు రూ.10 లక్షల డిపాజిట్ నుండి 18 ఏళ్ల వరకు ప్రతి నెలా భత్యం రూ.4 వేలు అందుకుంటారు. ఆ తర్వాత వారు నెలవారీ ఆదాయ లెక్కల ప్రకారం.. రూ.10 లక్షలుగా 23 ఏళ్ల వరకు వడ్డీని పొందుతారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.