ETV Bharat / bharat

ఆ సెంటిమెంట్​ వర్కౌట్​ అయితే వెంకయ్యే రాష్ట్రపతి! - రాష్ట్రపతి ఎన్నికలు వెంకయ్యనాయుడు

India President Elections 2022: రాష్ట్రపతి ఎన్నికకు నగారా మోగింది. వచ్చే నెల 18న ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఓ సెంటిమెంట్​ ప్రచారంలోకి వచ్చింది. ఆ సెంటిమెంట్‌ ఫలిస్తే వెంకయ్యనాయుడు.. రాష్ట్రపతి అయ్యే అవకాశాలు ఉంటాయన్న చర్చ నడుస్తోంది. మరోవైపు, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి కోసం కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రతిపక్షపార్టీల నేతలతో సంప్రదింపులు చేపట్టారు.

venkayya naidu
venkayya naidu
author img

By

Published : Jun 10, 2022, 2:29 PM IST

India President Elections 2022: రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈసారి ఎవరు రాష్ట్రపతి అవుతారోననే చర్చ జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సెంటిమెంటు ప్రచారంలోకి వచ్చింది. ఇప్పటివరకూ 13 మంది ఉప రాష్ట్రపతులుగా చేస్తే, వారిలో తొలి ముగ్గురు రాష్ట్రపతి అయ్యారు. మలి ముగ్గురూ కాలేదు. ఆ తర్వాత వరుసగా మరో ముగ్గురూ అయ్యారు. మళ్లీ ముగ్గురు కాలేదు. ఆ సెంటిమెంట్‌ ఫలిస్తే వెంకయ్యనాయుడికి రాష్ట్రపతి అయ్యే అవకాశాలు ఉంటాయన్న చర్చ నడుస్తోంది.

ఇదే సమయంలో మహిళలను తేవాలనుకుంటే మాత్రం దక్షిణాది నుంచి ఎవరినైనా తీసుకురావొచ్చన్న వాదన వినిపిస్తోంది. బిహార్‌లో అధికారాన్ని భాజపా చేతుల్లోకి తీసుకురావడానికి వీలుగా అక్కడి ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ను గౌరవప్రదంగా తప్పించేందుకు.. రాష్ట్రపతి పదవి ఇవ్వొచ్చన్న విశ్లేషణ కూడా వినిపిస్తోంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌, తెలంగాణ గవర్నర్‌ తమిళిసైల పేర్లూ ప్రచారంలో ఉన్నాయి. ఈ పేర్లను, విశ్లేషణలను భాజపా మంత్రులుగానీ, సీనియర్‌ నేతలుగానీ ధ్రువీకరించడం లేదు. అధికారికంగా ప్రకటించేంతవరకూ ఎవరి పేరునూ పరిగణనలోకి తీసుకోకూడదని వారు అభిప్రాయపడ్డారు.

ఉమ్మడి అభ్యర్థి కోసం కాంగ్రెస్​ వ్యూహ రచన.. భారత రాష్ట్రపతి ఎన్నికలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి కోసం కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రతిపక్షపార్టీల నేతలతో సంప్రదింపులు చేపట్టారు. డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, ఎన్‌సీపీ సుప్రీం నేత శరద్ పవార్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో ఆమె మాట్లాడినట్లు సంబంధిత వర్గాల వెల్లడించాయి. అలాగే ఈ విషయమై విపక్ష పార్టీలతో చర్చలు జరిపి, రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయం తీసుకువచ్చే బాధ్యతను పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గేకు సోనియా అప్పగించారు. 'దీనిపై ఖర్గే ఎన్డీయేతర, యూపీయేతర పార్టీల ఆలోచనలు తెలుసుకుంటారు. విపక్ష పార్టీలతో సమావేశాలు నిర్వహించి, వారు సూచించే అభ్యర్థుల పేర్లను తెలుసుకోనున్నారు' అని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడొకరు వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. గురువారం భారత 16వ రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ ఖరారైంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం వచ్చేనెల 24వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో కొత్త ప్రథమ పౌరుడి ఎన్నిక తేదీని నిన్న కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్రపతి ఎన్నికకు జూన్‌ 15న నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. జులై 18న ఓటింగ్‌ నిర్వహిస్తారు. 21న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషన్ల అధికారులు కూడా ఈసీ ప్రకటించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు.

ఇవీ చదవండి: రాష్ట్రపతి ఎన్నికకు మోగిన నగారా.. ఈ విషయాలు తెలుసా?

రాష్ట్రపతి అభ్యర్థుల రేసులో పలువురు గవర్నర్లు.. తమిళిసై కూడా!

జులై 18న రాష్ట్రపతి ఎన్నిక.. 21న ఓట్ల లెక్కింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.