ETV Bharat / bharat

బాపూ.. చూస్తున్నావా నీ దేశాన్ని!

అత్యాచారానికి యత్నించడం.. కాదంటే కిరోసిన్‌ పోసి కాల్చేయడం.. ప్రతిఘటిస్తే కత్తితో పొడవడం.. ఎదురు తిరిగితే చావబాదడం. ఇవీ.. ఉత్తర్‌ప్రదేశ్‌లో బుధవారం ఒక్కరోజే వెలుగులోకి వచ్చిన ఘోరాలు. దేశం ఎటు పోతోంది? బాపూ కలలు కన్న రాజ్యం ఏమైంది?

India
బాపూ.. చూస్తున్నావా నీ దేశాన్ని!
author img

By

Published : Feb 25, 2021, 5:31 AM IST

భారతమాత అంటూ దేశాన్ని తల్లిలా భావించే దేశంలో.. అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోంది. బయటకు వెళ్లింది మొదలు ఇంటికి వచ్చేవరకు భయంతో బిక్కుబిక్కుమంటూ అడుగులు వేయాల్సిన పరిస్థితి. ఆగంతుకుడు, పరిచయస్థుడు, బంధువు.. ఇలా ఎవరి రూపంలో మృగాడు దాగున్నాడో? అని అనుక్షణం 'భయం'కరమైన మానసిక క్షోభ అనుభవించాల్సిన దుస్థితి. అత్యాచారానికి యత్నించడం.. కాదంటే కిరోసిన్‌ పోసి కాల్చేయడం.. ప్రతిఘటిస్తే కత్తితో పొడవడం.. ఎదురు తిరిగితే చావబాదడం. ఇవీ.. ఉత్తర్‌ప్రదేశ్‌లో బుధవారం ఒక్కరోజే వెలుగులోకి వచ్చిన ఘోరాలు.

కుమార్తెపై అత్యాచారం జరిగినా భయంతో పోలీసులకు చెప్పలేదని ఓ తండ్రి వాపోవడం పరిస్థితి ఎంతలా దిగజారిందో తెలియజేస్తోంది. ఇక కేరళలో ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహాన్ని నటించిన ఏడుగురు వ్యక్తులు బాలికకు మాదకద్రవ్యాలు ఇచ్చి దారుణానికి ఒడిగట్టారు. గుంటూరు జిల్లాలో ఒకరితో కాస్తంత చనువుగా ఉండడమే ఓ యువతి పాలిట మరణ శాసనమైంది.

కిరోసిన్‌ పోసి కాల్చేశారు..

తనపై తొలుత సామూహిక అత్యాచారానికి యత్నించారని, ప్రతిఘటించడంతో నిప్పు పెట్టి హత్య చేసేందుకు ప్రయత్నించారని ‘షాజహాన్‌పుర్‌’ బాధితురాలు బుధవారం పోలీసులకు తెలిపారు. కళాశాల నుంచి ఇంటికి బయలుదేరిన ఈ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఒంటి నిండా కాలిన గాయాలతో, నగ్నంగా లఖ్‌నవూ-బరేలీ జాతీయ రహదారి పక్కన అచేతనావస్థలో కనిపించిన దిగ్భ్రాంతికర ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పుర్‌లో సోమవారం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. రాయ్‌ ఖెడా గ్రామం సమీపంలో సోమవారం ముగ్గురు వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు, బాధితురాలికి 72 శాతం కాలిన గాయాలయ్యాయని లఖ్‌నవూలోని శ్యామాప్రసాద్‌ ముఖర్జీ ఆసుపత్రి డైరెక్టర్‌ ఎస్సీ సౌంద్రియాల్‌ చెప్పారు.

గుంటూరు జిల్లాలో దారుణం

గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన కోట అనూష అనే యువతికి, బొల్లాపల్లి మండలం పమిడిపాడుకు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డికి కొన్నాళ్లుగా పరిచయం ఉంది. ఇటీవల అనూష మరో అబ్బాయితో కాస్తంత కలివిడిగా మాట్లాడుతోంది. ఈ విషయమై బుధవారం ఇద్దరి మధ్య మాటమాటా పెరిగింది. చివరకు ఆమె ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.

భయపడి పోలీసులకే చెప్పలేదు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హమీర్పుర్‌ పట్టణంలో రెండు రోజుల క్రితం అత్యాచారానికి గురైన 17 ఏళ్ల యువతి బుధవారం కన్నుమూసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. బాధితురాలి మరణం తర్వాత ఆమె తండ్రి పెదవి విప్పారు. తన కుమార్తెపై సోమవారం ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేశారని, భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని వాపోయారు.

14ఏళ్ల బాలికకు మాదక ద్రవ్యాలిచ్చి..

ఇన్‌స్టాగ్రామ్‌ స్నేహం ఓ బాలిక పాలిట శాపంగా మారింది. ఏడుగురు వ్యక్తులు స్నేహం ముసుగులో 14 ఏళ్ల బాలికకు మాదకద్రవ్యాలు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కేరళలోని మలప్పురం జిల్లాలో జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనపై జరిగిన దాడిని బంధువులకు 10 రోజుల క్రితం చెప్పగా.. చైల్డ్‌లైన్‌కు వచ్చిన సమాచారంతో ఈ నెల 17న కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడే ముందు ఆమెకు ఇద్దరు నిందితులు గంజాయి వంటి మాదకద్రవ్యాలు ఇచ్చారని, ఈ కేసులో ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్ట్‌ చేశామని వెల్లడించారు.

కాటేసిన బంధువు..

ఉత్తర్‌ప్రదేశ్‌లోనే ఉన్న బాందా జిల్లాలో 11 ఏళ్ల బాలికపై ఆమె బంధువు ఒకరు సోమవారం రాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఇంటికి వచ్చిన నిందితుడు అనంతరం ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. మంగళవారం ఉదయం కుమార్తె కనిపించకపోవడంతో వెతుకుతున్న తల్లిదండ్రులు ఆమె నిందితుడి ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు.

దళిత బాలికపై దాష్టీకం..

మహోబా జిల్లాలో ఓ దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు అనంతరం ఆమెను తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించి రోహిత్‌ యాదవ్‌, కులు రాజ్‌పుత్‌ అనే వ్యక్తులను మంగళవారం అరెస్టు చేశామని పోలీసులు బుధవారం తెలిపారు. పన్వాడీ పోలీస్‌స్టేషన్‌ ప్రాంతంలోని బాధితురాలి ఇంటికి ఆదివారం వెళ్లిన కులు రాజ్‌పుత్‌ అనంతరం ఆమెపై దాడి చేశాడు. ఆ తర్వాత రోహిత్‌ యాదవ్‌ అత్యాచారం చేశాడని పోలీసులు చెప్పారు.

ప్రతిఘటిస్తే కత్తిపోట్లు..

గోండా జిల్లాలో కామాంధులు ఓ బాలికపై అత్యాచారం చేసి అనంతరం కత్తితో పొడిచారు. పదో తరగతి చదువుతున్న బాలిక మంగళవారం సాయంత్రం పాఠశాల నుంచి సైకిల్‌పై వస్తుండగా, నలుగురు వ్యక్తులు అడ్డగించారు. అనంతరం ఆమెను ఓ పొలంలోకి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. ఈ క్రమంలో ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో కత్తితో పొడిచారు. ఈ ఘటనకు సంబంధించి ఖండేరు అనే వ్యక్తి, మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసు సూపరింటెండెంట్‌ శైలేశ్‌కుమార్‌ పాండే చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.