ETV Bharat / bharat

మోదీ చెప్పిన 'ప్రికాషన్​ డోసు'కు అర్థమేంటి? బూస్టర్​ కాదా? - ప్రధాని మోదీ

Precaution dose in India: టీకా రెండు డోసులు తీసుకున్న ఆరోగ్య కార్యకర్తలు, 60ఏళ్లు పైబడిన వృద్ధులకు 'ప్రికాషన్​ డోసు' ఇస్తున్నట్టు ప్రధాని మోదీ ఓ ప్రకటన చేశారు. బూస్టర్​ డోసు గురించి ఇప్పటికే తెలుసుకున్న ప్రజలు.. ప్రికాషన్​ డోసు పేరు వినడం ఇదే తొలిసారి! ఇంతకీ ఈ ప్రికాషన్​ డోసు అంటే ఏంటి? బూస్టర్​ డోసు, ప్రికాషన్​ డోసుకు మధ్య ఉన్న తేడా ఏంటి?

what is a precaution dose?
మోదీ చెప్పిన 'ప్రికాషన్​ డోసు'కు అర్థమేంటి?
author img

By

Published : Dec 26, 2021, 2:14 PM IST

Precaution dose in India: 15-18ఏళ్ల పిల్లలకు జనవరి 3 నుంచి కొవిడ్​ టీకాలు అందించనున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం వెల్లడించారు. అదే సమయంలో.. టీకా రెండు డోసులు పూర్తి చేసుకున్న ఆరోగ్య కార్యకర్తలు, 60ఏళ్లుపైబడిన వృద్ధులకు.. అదనంగా మరో డోసు ఇవ్వనున్నట్టు ప్రకటించారు మోదీ. సాధారణంగా.. ఈ ప్రక్రియకు ప్రపంచవ్యాప్తంగా 'బూస్టర్​ డోసు' అని పేరు ఉంది. అయితే మోదీ మాత్రం అందుకు భిన్నంగా.. 'ప్రికాషన్​ డోసు​'(ముందుజాగ్రత్త డోసు) అన్న పదాన్ని వినియోగించారు. ఇప్పుడు ఈ ప్రికాషన్​ డోసు సర్వత్రా చర్చనీయాంశమైంది.

ఏంటి ఈ ప్రికాషన్​ డోసు?

ప్రికాషన్​ డోసుకు ప్రస్తుతం సరైన నిర్వచనం లేదు. టీకా రెండు డోసులు తీసుకున్నవారు.. మూడో డోసుగా వేరే రకం వ్యాక్సిన్​ను తీసుకోవడాన్ని ప్రికాషన్​ డోసు అనొచ్చని కొవిడ్​ వ్యాక్సినేషన్​ సాంకేతిక బృందం చెబుతోంది. అంటే.. కొవాగ్జిన్​ టీకాలు తీసుకున్నవారికి మరో డోసుగా.. ఇతర వ్యాక్సిన్లు ఇవ్వడం అని అర్థం! ఇదే నిజమైతే.. మూడో డోసు తీసుకున్నామంటే.. అది పూర్తిగా కొత్త టీకా అవుతుంది.

రెండో డోసు తీసుకున్న తర్వాత 9 నుంచి 12 నెలలకు ప్రికాషన్ డోసు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. టీకా పంపిణీపై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం ఈ మేరకు కాలవ్యవధిపై సమాలోచనలు చేస్తోంది. శాస్త్రీయ పద్ధతుల్లో అంచనా వేసి దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

booster dose importance:

అందువల్ల ప్రికాషన్​ డోసుకు, బూస్టర్​ డోసుకు వేరువేరు అర్థాలు వస్తాయి. బూస్టర్​ డోసు అంటే.. అప్పటికే తీసుకున్న రెండు డోసులకు అదనంగా మరో డోసు(అదే రకం వ్యాక్సిన్​) తీసుకోవడం. బూస్టర్​ డోసుకు తొలుత అమెరికా అనుమతులిచ్చింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా బూస్టర్​ డోసులను వినియోగిస్తున్నారు.

ఇవీ చూడండి:-

కొవిడ్​ టీకా తీసుకోని ఉద్యోగులకు జీతం కట్​!

మూడో డోసుగా ఏ టీకా ఇస్తారు? ఎన్ని రోజులకు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.