ఎన్నికల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడటం ద్వారా బంగాల్‌లో భాజపా విజయాన్ని తృణమూల్ కాంగ్రెస్ అడ్డుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బంగాల్‌లోని సిలిగురిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"కూచ్ బెహార్‌లో జరిగిన కాల్పుల ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నాను. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబసభ్యులకు సంతాపం తెలుపుతున్నాను. ఎన్నికల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడటం ద్వారా బంగాల్‌లో భాజపా విజయాన్ని తృణమూల్ కాంగ్రెస్ అడ్డుకోలేదు."
-- నరేంద్రమోదీ, భారత ప్రధాని
మొదటి మూడు విడతల ఎన్నికల్లో భాజపా పెద్దఎత్తున ప్రజల మద్దతు కూడగట్టిందన్నారు మోదీ. మెజార్టీ సీట్లను భాజపా సొంతం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మమత.. ఆమె పార్టీ గూండాలు, ఓటమి అక్కసుతో భద్రతా సిబ్బందిపైనే దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు.
ఇదీ చదవండి : ఎన్నికల వేళ బలగాల కాల్పులు - నలుగురు మృతి