ETV Bharat / bharat

'ఆ బిర్యానీ తింటే లైంగిక సామర్థ్యానికి దెబ్బ'.. హోటల్​కు అధికారుల సీల్

ఓ వింత కారణం చెప్పి బిర్యానీ దుకాణాన్ని మూసేయించారు బంగాల్​లోని కూచ్​బిహార్ మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్మన్. బిర్యానీలో ఉపయోగిస్తున్న మసాలాల కారణంగా పురుషుల్లో లైంగిక సామర్థ్యం దెబ్బతింటుందంటూ షాప్​ను సీజ్ చేయించారు.

coochbehar biryani shop closed
'ఆ బిర్యానీ తింటే లైంగిక సామర్థ్యానికి దెబ్బ'.. హోటల్​కు అధికారుల సీల్
author img

By

Published : Oct 24, 2022, 10:11 AM IST

బిర్యానీ తింటే పురుషుల్లో లైంగిక సామర్థ్యం దెబ్బతింటుందా? బిర్యానీ తయారీ కోసం ఉపయోగించే మసాలాదినుసులు హాని చేస్తాయా? అవుననే అంటున్నారు బంగాల్​లోని కూచ్​బిహార్ పురపాలక సంస్థ ఛైర్మన్, తృణమూల్ కాంగ్రెస్​కు చెందిన వివాదాస్పద నేత రబీంద్రనాథ్​ ఘోష్. తన వాదన సరి అనేందుకు శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేకపోయినా.. ఓ బిర్యానీ షాప్​పై తన ప్రతాపం చూపించారు. కూచ్​బిహార్ నగరంలోని దుకాణాన్ని అధికారులతో బలవంతంగా మాయించారు.

"కూచ్​బిహార్ మున్సిపల్ పరిధిలో అనేక దుకాణాలు అక్రమంగా నడుస్తున్నాయని మాకు సమాచారం అందింది. అలాంటి దుకాణాల్లో ఒకటైన కోల్​కతా బిర్యానీ షాప్​పై ఓ ఆరోపణ వచ్చింది. ఆ దుకాణం వారు ఉపయోగిస్తున్న కొన్ని పదార్థాల కారణంగా పురుషుల్లో లైంగిక సామర్థ్యం దెబ్బతింటుందని వేర్వేరు వర్గాల నుంచి ఫిర్యాదులు అందాయి. అందుకే వచ్చి ఈ దుకాణాన్ని మూసేశాం" అని చెప్పారు ఘోష్.

గతంలో బంగాల్ మంత్రిగానూ చేసిన రబీంద్రనాథ్​ ఘోష్.. ఇదే తరహాలో మరికొన్ని దుకాణాల్ని మూసేస్తామని సంకేతాలిచ్చారు. "ఈ ఒక్క దుకాణమే కాదు.. మరెన్నో షాప్​లను రోడ్డును ఆక్రమించి నడుపుతున్నారు. రోడ్లపైనే వంట చేస్తున్నారు. అసలు వీరంతా ఎక్కడ నుంచి వచ్చారో తెలియదు. బిహార్, ఉత్తర్​ప్రదేశ్ వాళ్లు కావచ్చు. అర్ధరాత్రి వరకు ఈ షాప్​లు తెరిచే ఉంచుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారు. కొందరు తాగి, ఇక్కడ వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారు. వీరెవరికీ లైసెన్సులు లేవు. వీరి గురించి మా దగ్గర ఎలాంటి సమాచారం లేదు. అందుకే వీరు ఎవరు, ఎక్కడ నుంచి వచ్చారో తెలుసుకోమని పోలీసులను కోరాం" అని చెప్పారు ఘోష్.

ఆ ఒక్క దుకాణమే ఎందుకు?
ఘోష్ దగ్గరుండి సీజ్​ చేయించిన బిర్యానీ షాప్.. పప్పూ ఖాన్ అనే వ్యక్తిది. అసలు ఏం జరిగిందో మీడియాకు చెప్పేందుకు అతడు నిరాకరించాడు. అయితే.. ఈ షాప్​ను దసరా నవరాత్రుల ముందే తెరిచారని, వ్యాపారం భారీస్థాయిలో సాగుతోందని స్థానికులు తెలిపారు. మరోవైపు.. పప్పూ ఖాన్​ భార్య, కుమార్తె.. ఎవరితోనో గొడవ పడుతున్న వీడియో ఒకటి వైరల్ అయింది. లైసెన్స్ లేకుండా నడుస్తున్న షాప్​లను మూసేయాలని వారు డిమాండ్ చేయడం ఆ వీడియోలో కనిపించింది.

అయితే.. ఏ ఒక్కరినో లక్ష్యంగా చేసుకోలేదని, ఆక్రమణల తొలగింపులో భాగంగానే ఈ షాప్​ను మూసేసినట్లు పురపాలక సంస్థ వర్గాలు స్పష్టం చేశాయి. సరైన లైసెన్స్ ఉన్నవారు వ్యాపారం చేసుకుంటే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాయి. మిగిలిన దుకాణాల్ని ఎందుకు సీజ్​ చేయలేదన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.