బంగాల్ దక్షిణ 24 పరగణాల జిల్లా రాంపుర్‌లో జరిగిన బాంబు పేలుడులో ఆరుగురు భాజపా కార్యకర్తలు గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగిందని వెల్లడించారు.
ఈ ఘటనకు తృణమూల్ కాంగ్రెస్ నేతలే కారణమని భాజపా ఆరోపిస్తోంది. అయితే తమకు ఎలాంటి సంబంధం లేదని టీఎంసీ నేతలు చెబుతున్నారు.
ఇదీ చూడండి: ఘోర ప్రమాదం- ముగ్గురు మృతి, 30 మందికి గాయాలు