ETV Bharat / bharat

ఎన్నికల వేళ బంగాల్​లో బాంబుల కలకలం - బంగాల్ తాజా వార్తలు

ఎన్నికల వేళ బంగాల్​లో మరోసారి బాంబులు కలకలం సృష్టించాయి. ఉత్తర 24 పరగణాల జిల్లా భట్​పారా ప్రాంతంలోని అనుమానిత ప్రాంతాల్లో పోలీసులు సోదాలు నిర్వహించగా.. బాంబులు, ఇతర పేలుడు పదార్థాలు బయటపడ్డాయి.

West Bengal polls: Bombs, gun powder, bullets recovered in Bhatpara
బంగాల్​: పోలీసుల సోదాల్లో బయటపడిన బాంబులు
author img

By

Published : Apr 11, 2021, 10:17 AM IST

బంగాల్​లో మరోసారి భారీ స్థాయిలో బాంబులు బయటపడటం కలకలం రేపింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని భట్​పారా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు శనివారం తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో బాంబులు, బాంబు తయారీ పరికరాలు, గన్​పౌడర్​, బుల్లెట్​లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై పేలుడు పదార్థాలు, ఆయుధాల నియంత్రణ చట్టాల కింద కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

West Bengal polls: Bombs, gun powder, bullets recovered in Bhatpara
పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంటున్న పోలీసులు

సోదాల్లో లభించిన బుల్లెట్​లు

రాష్ట్రంలో ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం చర్యలు చేపడుతోంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పలు అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది.

ప్రస్తుతం.. బాంబులు బయటపడిన నియోజకవర్గంలో ఈ నెల 22న పోలింగ్​(ఆరో దశ) జరగనుంది.

బంగాల్​లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో.. గతంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఎన్నికలను పటిష్ఠమైన భద్రత నడుమ ఎనిమిది దశల్లో నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం.

ఇదీ చదవండి: 'అడుక్కోవడం నేరమా.. కాదా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.