బంగాల్ పశ్చిమ్ బర్ధమాన్ జిల్లా కుల్తీ పోలీసు స్టేషన్లో 21 ఏళ్ల యువకుడు అనుమానాస్పద రీతిలో మరణించడం దుమారం రేపింది. పోలీసులు కొట్టడం వల్లే అతడి చనిపోయాడని ఆరోపిస్తూ యువకుడి బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగారు. బరాకర్ ఆరాటో పోలీసు ఔట్‌పోస్ట్‌పై దాడి చేసి.. పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేసి నిప్పంటించారు. ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు.
దొంగతనం కేసులో సోమవారం రాత్రి యువకుణ్ని అరెస్టు చేసిన ఇద్దరు పోలీసు అధికారులు జైలులో చిత్రహింసలు పెట్టారని మృతుడి తండ్రి ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు సదరు పోలీసులను సస్పెండ్ చేశారు.
"జైలులో ఉన్న నిందితుడి ఆరోగ్యం మంగళవారం ఉదయం క్షీణించింది. స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లగా మృతి చెందినట్లు ధ్రువీకరించారు. నిరసనల్లో ఎవరూ గాయపడలేదు. ఘటనకు బాధ్యులైన ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశాం. ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులో ఉన్నాయి."
-సీనియర్ పోలీసు అధికారి
ఇవీ చదవండి: