ETV Bharat / bharat

'బంగాల్​లో సిండికేట్ రాజ్యం- పైసలిస్తేనే పని' - ప్రధాని మోదీ

బంగాల్​ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. హుగ్లీలో బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో సిండికేట్ రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. సామాన్యులు డబ్బులు ఇవ్వకుండా ఒక్క పనీ జరగడం లేదన్నారు. కేంద్రం పథకాలను అమలు చేయకుండా లక్షలాది మందికి దీదీ సర్కార్ అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు.

Modi Bengal visit news
బంగాల్​లో మోదీ పర్యటన
author img

By

Published : Feb 22, 2021, 4:48 PM IST

Updated : Feb 22, 2021, 6:39 PM IST

బంగాల్​లో మమతా బెనర్జీ ప్రభుత్వంపై పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. రాష్ట్రంలో సిండికేట్​ రాజ్యం నడుస్తోందన్నారు. డబ్బులు ముట్టజెప్పకుండా ఏ పనీ జరగడం లేదని ఆరోపించారు. ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు బంగాల్​ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు మోదీ. రాష్ట్ర వారసత్వ సంస్కృతి, దిగ్గజాల పట్ల దీదీ సర్కార్​ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హుగ్లీలో భాజపా నిర్వహించిన బహిరంగ సభలో దుయ్యబట్టారు.

" రాష్ట్రంలో ఏ పని జరగాలన్నా ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇల్లు అద్దెకు ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా తప్పనిసరిగా సిండికేట్ల అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి. వందేమాతర గేయం రాసిన బంకిం చంద్ర చటోపాధ్యాయ ఇంటిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని నా దృష్టికి వచ్చింది. భానిసత్వ సంకెళ్లు తెంచి స్వాతంత్ర్య పోరాటానికి కొత్త జీవం పోసిన ఆయన నివాసాన్ని పట్టించుకోకపోవడం బంగాల్​ను అవమానించడమే. బంగాల్​ ప్రజలు స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. వారు మార్పును కోరుకుంటున్నారు. మీరు ఆకాంక్షించే అభివృద్ధిని మేము సాధిస్తాం. కానీ ఎవ్వరినీ బుజ్జగించం. "

- ప్రధాని మోదీ.

బంగాల్​లో ముడుపులు ముట్టజెప్పే సంప్రదాయం ఉన్నంతకాలం అభివృద్ధి సాధ్యం కాదన్నారు మోదీ. రైతులు, పేదల సంక్షేమం కోసం కేంద్రం తీసుకొచ్చిన కిసాన్ సమ్మాన్ నిధి, ఆయుష్మాన్ భారత్ పథకాలను దీదీ సర్కార్​ అమలు చేయడం లేదని విమర్శించారు. దీని వల్ల లక్షలాది మంది లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోందన్నారు.

బంగాల్​ పర్యటనలో భాగంగా కోల్​కతా మెట్రో విస్తరణ ప్రాజెక్టు ప్రారంభించారు మోదీ. నోవాపారా నుంచి దక్షిణేశ్వర్​ వరకు నడిచే రైలుకు వర్చువల్​గా జెండా ఊపారు. అనంతరం హుగ్లీలో ఏర్పాటు చేసిన ర్యాలీలో ప్రసంగించి మమత ప్రభుత్వం విమర్శల దాడి చేశారు.

ఇదీ చదవండి:'గత ప్రభుత్వాల వల్లే అసోం వెనుకబడింది'

Last Updated : Feb 22, 2021, 6:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.