బంగాల్ ముఖ్య కార్యదర్శి ఆలాపన్ బంధోపాధ్యాయ్ డిప్యుటేషన్‌పై ప్రధాని మోదీకి బంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata banerjee) లేఖ రాశారు. సీఎస్‌ను రిలీవ్ చేయలేమని ప్రధానికి స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న క్లిష్ట పరిస్థితుల్లో ఆయన్ను వదులుకోలేమని అన్నారు. ఈ నేపథ్యంలో దిల్లీకి వచ్చి రిపోర్టు చేయాలని కేంద్రం పంపిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరారు.
"సీఎస్‌ను రీకాల్ చేస్తూ ఇచ్చిన ఏకపక్ష ఆదేశాలను చూసి షాక్‌కు గురయ్యా. ఈ క్లిష్ట సమయంలో బంగాల్ ప్రభుత్వం తన సీఎస్‌ను వదులుకోదు, వదలబోదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి సీఎస్ పదవీకాలాన్ని మూడు నెలల పాటు కొనసాగిస్తూ కేంద్రం జారీ చేసిన ఆదేశాలే కొనసాగుతాయని భావించండి."
-మమతా బెనర్జీ, బంగాల్ సీఎం
ప్రస్తుతం బంగాల్ సీఎస్‌గా ఉన్న ఆలాపన్‌కు మే 31తో 60 ఏళ్లు నిండుతాయి. ఇదే రోజు ఆయన పదవీవిరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన పదవీ కాలాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata banerjee) .. కేంద్ర ప్రభుత్వాన్ని మే 17న అభ్యర్థించారు. కొవిడ్‌పై పోరులో ఆయన సేవలు అవసరమవుతాయని పేర్కొన్నారు.
దీనికి మే 25న సానుకూలంగా స్పందించిన కేంద్రం.. ఆయన పదవి కొనసాగింపునకు అనుమతించింది. ఇది జరిగి మూడు రోజులు కాకముందే ఈ ఆదేశాలను వెనక్కి తీసుకుంది. సీఎస్ బంధోపాధ్యాయ్ సేవలను ఉపయోగించుకోదలచినట్టు సమాచారం పంపించింది. తక్షణమే ఆయనను రిలీవ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇదీ చదవండి-