ETV Bharat / bharat

అసెంబ్లీలో హైడ్రామా- గవర్నర్​ ప్రసంగానికి బ్రేక్ - గవర్నర్ జగ్​దీప్ ధన్​కర్ ప్రసంగం వార్తలు

బంగాల్​ గవర్నర్​ జగ్​దీప్​ ధన్​కర్​కు అసెంబ్లీలో చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో హింస చెలరేగడంపై భాజపా సభ్యులు పెద్దఎత్తున నిరసనలకు దిగారు. దీనితో గవర్నర్ తన ప్రసంగాన్ని పూర్తి చేయకుండానే వెనుదిరిగారు.

west bengal governor
బంగాల్​ గవర్నర్​ జగ్​దీప్​ ధన్​కర్​
author img

By

Published : Jul 2, 2021, 3:17 PM IST

Updated : Jul 2, 2021, 3:50 PM IST

బంగాల్​ ఎన్నికల అనంతరం కొలువుదీరిన 17వ అసెంబ్లీ తొలి సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించేందుకు సిద్ధమైన బంగాల్​ గవర్నర్​ జగ్​దీప్​ ధన్​కర్​కు చేదు అనుభవం ఎదురైంది. సభ ప్రారంభం కాగానే.. ఎన్నికల అనంతరం జరిగిన హింసపై విచారణ జరపాల్సిందేనని ప్రతిపక్ష భాజపా ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. అంతటితో ఆగక వెల్​లోకి దూసుకెళ్లి ఎన్నికల అనంతర హింసపై చర్చకు డిమాండ్ చేశారు.

దీనితో గవర్నర్ జగ్​దీప్ ధన్​కర్ ప్రసంగాన్ని 3-4 నిమిషాలకే ఆపేయాల్సి వచ్చింది. అనంతరం భాజపా ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.

అంతకుముందు తన ప్రసంగంలో రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింస గురించి గవర్నర్ ప్రస్తావించగా.. భాజపా సభ్యులు 'జై శ్రీ రామ్', 'భారత్ మాతా కీ జై' అంటూ నినాదాలు చేశారు.

ఇవీ చదవండి:

బంగాల్​లో రాష్ట్రపతి పాలనపై కేంద్రానికి నోటీసులు

ఉత్తరాఖండ్​కు కొత్త సీఎం- మూడు నెలలకే మార్పెందుకు?

Last Updated : Jul 2, 2021, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.