బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తృణమూల్ కార్యకర్తల సమక్షంలో భారీ ర్యాలీగా బయల్దేరిన ఆమె.. ఎన్నికల అధికారులకు బుధవారం మధ్యాహ్నం నామపత్రాలు సమర్పించారు. ఈ సమయంలో టీఎంసీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి.



ఎన్నికలకు ముందు తృణమూల్‌ను వీడి భాజపాలో చేరిన సువేందు అధికారి కూడా ఇక్కడి నుంచే బరిలో నిలుస్తుండం వల్ల పోటీ రసవత్తరంగా మారనుంది.
శివాలయంలో పూజలు..

నామినేషన్‌కు ముందు నందిగ్రామ్‌లోని శివాలయాన్ని సందర్శించారు మమతా బెనర్జీ. గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

