బంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఏడో విడత ఎన్నికల్లో దక్షిణ కోల్‌కతాలోని భవానీపుర్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మిత్రా ఇన్స్టిట్యూషన్ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటువేశారు. చక్రాల కుర్చీలో పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించిన ఆమె.. అనంతరం విజయ సంకేతం చూపిస్తూ బయటకు వచ్చారు.
గతంలో రెండుసార్లు భవానీపుర్ నుంచి పోటీ చేసిన దీదీ.. ఈసారి నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు.
ఇదీ చదవండి: ఆక్సిజన్ కొరతతో నలుగురు కరోనా రోగులు మృతి
ఏడో దశలో 34 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇందుకోసం 12,068 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. గత ఆరు విడతల పోలింగ్ సందర్భంగా జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. 796 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో.. పోలింగ్ సందర్భంగా కొవిడ్ నిబంధనలను అమలు చేస్తున్నారు.
ఈనెల 29న చివరి విడత పోలింగ్ జరగనుండగా.. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇదీ చదవండి: కొవిడ్ కట్టడిపై సీడీఎస్ రావత్‌తో మోదీ భేటీ