ETV Bharat / bharat

బంగాల్​లో భాజపా కార్యాలయంపై బాంబు దాడి

బంగాల్​లో భాజపా కార్యాలయంపై బాంబు దాడి కలకలం సృష్టిస్తోంది. ఈ దాడులపై భాజపా, టీఎంసీ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. పోలీసుల ఎదుటే ఇలాంటి ఘటనలు జరుగుతున్నా.. వారు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని భాజపా ఆగ్రహం వ్యక్తం చేసింది.

Bombs were hurled at BJP's camp office, Bengal elections
భాజపా కార్యాలయంపై బాంబు దాడి, బంగాల్ ఎన్నికలు
author img

By

Published : Apr 19, 2021, 10:43 AM IST

బంగాల్​లో మరోసారి బాంబుల కలకలం రేగింది. ఉత్తర 24 పరగణాల జిల్లా పానీహాటీ నియోజకవర్గంలోని భాజపా కార్యాలయంపై ఆదివారం రాత్రి దుండగులు ఐదు బాంబులు విసిరారు. వాటిలో పేలని ఒక బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మరో రెండు బాంబులను భాజపా కార్యకర్తల ఇళ్లపైకి విసిరినట్లు సమాచారం.

ఈ దాడులు చేసింది అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కార్యకర్తలేనని భాజపా ఆరోపించింది. దీంతో ఆగ్రహించిన భాజపా కార్యకర్తలు.. టీఎంసీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.

Bombs were hurled at BJP's camp office, Bengal elections
భాజపా కార్యకర్తల ఆందోళన

"రాష్ట్రాన్ని ఏ విధంగా నడుపుతున్నారు? ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. పోలీసుల ఎదుటే భాజపా కార్యకర్తల ఇళ్లపై బాంబులు విసురుతున్నారు. అయినా వారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు."

-సన్మోయ్ బందోపాధ్యాయ్, పానీహాటీ భాజపా అభ్యర్థి

అనుచరులతో భాజపా అభ్యర్థి సన్మోయ్

ఖండించిన తృణమూల్..

అయితే, భాజపా ఆరోపణలను టీఎంసీ ఖండించింది. తన అనుచరులతో బాంబు దాడులు చేయించింది సన్మోయేనని చెప్పుకొచ్చింది. సజావుగా సాగుతున్న ఎన్నికల ప్రక్రియలో అల్లర్లను సృష్టిస్తున్నారని ఆరోపించింది.

ఇవీ చూడండి:

బంగాల్​లో ఎన్నికల వేళ బాంబుల కలకలం

బంగాల్​ భాజపా అభ్యర్థిపై కాల్పులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.