ETV Bharat / bharat

బోరుబావిలో గున్న ఏనుగు- స్థానికుల సహాయంతో బయటకు - గజరాజును కాపాడిన అటవీ అధికారులు

ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన గున్న ఏనుగును గ్రామస్థుల సాయంతో సురక్షితంగా బయటకు తీశారు అటవీ అధికారులు. గజరాజును మనిషి తాకకూడదనే అక్కడి సంప్రదాయాన్ని పాటిస్తూ.. చాకచక్యంగా వ్యవహరించి కాపాడారు. అనంతరం.. అడవిలోకి తరలించారు. ఈ ఘటన బంగాల్​లోని ఝూడ్​గ్రామ్​లో జరిగింది.

Elephant, Borewell
ఏనుగు పిల్ల, గున్న ఏనుగు
author img

By

Published : May 9, 2021, 8:27 AM IST

బోరుబావిలోపడిన గున్న ఏనుగును చాకచక్యంగా రక్షించిన అటవీ సిబ్బంది

బంగాల్​ అటవీ ప్రాంతంలో ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన ఏనుగు పిల్లను రక్షించారు గ్రామస్థులు. ఏనుగును తాకకూడదనే నిబంధనతో.. ఆ బోరుబావిలో ఎండుగడ్డి వేస్తూ, వెదురు కర్రల సాయంతో గజరాజును బయటకు తీశారు.

ఇలా పడింది!

ఝాడ్​గ్రామ్​ అటవీ ప్రాంతానికి చెందిన ఓ ఏనుగుల గుంపు.. మణిక్​పారాలోని దల్కాటి గ్రామ పరిసరాల్లో సంచరిస్తుండేదని స్థానికులు తెలిపారు. సుమారు 30 నుంచి 35 గజరాజులున్న ఈ గుంపులోంచి ఓ గున్న ఏనుగు పాడుబడ్డ బోరుబావిలో పడిపోయింది. దీంతో ఆ ఏనుగు ఘీంకారాలు చేయగా.. విషయం స్థానికులకు తెలిసింది. వారు అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు.

ఇలా తీశారు..

అక్కడి సంప్రదాయం ప్రకారం.. ఏనుగులను మనుషులు తాకరాదు. ఒక వేళ తాకితే.. ఆ గజరాజును గుంపులోకి వదలకూడదనే నిబంధన ఉంది. ఈ నియమాన్ని దృష్టిలో ఉంచుకుని చాకచక్యంగా వ్యవవహరించారు దల్కాటి గ్రామస్థులు, అటవీ సిబ్బంది. నీళ్లులేని బోరుబావిలోకి ఎండుగడ్డి మోపులను వేస్తూ, వెదురు కర్రల సాయంతో ఏనుగును బయటకు తీశారు. అనంతరం.. దాన్ని అడవిలోకి తరలించి వాటి గుంపులో కలిపారు.

ఇదీ చదవండి: ఆ గ్రామంలో 21 రోజుల్లో 21 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.