ETV Bharat / bharat

దీదీ అడ్డా పదిలం- భాజపా వ్యూహం విఫలం!

ఆట ముగిసింది.. ఐదు నెలల పాటు ఉత్కంఠంగా సాగిన బంగాల్ దంగల్ లో మమతా బెనర్జీ తిరుగులేని విజయం సాధించారు. ముచ్చటగా మూడోసారి బంగాల్ ప్రజలు దీదీకి పట్టం కట్టారు. ఎన్నో ప్రశ్నలను పటాపంచలు చేస్తూ తిరుగులేని విజయాన్ని అందించారు. నియంతృత్వ పాలన, పక్షపాతం.. లాంటి ఆరోపణలను అధిగమిస్తూ.. బంగాల్ రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగారు మమత.

mamata benerjee
మమతా బెనర్జీ
author img

By

Published : May 3, 2021, 12:15 AM IST

బంగాల్ దంగల్ ముగిసింది. బంగాల్ ప్రజలు.. తమ తీర్పును అందించారు. మమతకు హ్యాట్రిక్ విజయాన్ని కట్టబెట్టారు. ముచ్చటగా మూడోసారి తృణమూల్ కాంగ్రెస్​కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎలాగైన బంగాల్ పీఠాన్ని చేజిక్కించుకోవాలన్న భాజపా ఎత్తుగడలు ఫలించలేదు. ఇక కింగ్ మేకర్​గా అవతరిస్తామన్న కాంగ్రెస్- లెఫ్ట్ కూటమి కుదేలైంది.

ఎత్తుగడలను ఎదుర్కొని..

అఖండ విజయం తర్వాత దేశ రాజకీయాల్లోనే భాజపాకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశం మమతకు ఏర్పడింది. ఎన్నికల ప్రచార సమయంలో మతపరమైన భావోద్వేగ ప్రసంగాలతో ఓట్లను చీల్చాలని భాజపా వేసిన ఎత్తుగడలు.. చివరకు ఆ పార్టీనే కోలుకోలేని దెబ్బతీశాయని ఎన్నికల ఫలితాలను చూస్తే స్పష్టమవుతోంది. మాల్దా, ముర్షిదాబాద్ నియోజకవర్గాలతోపాటు దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాలు, హౌడౌ జిల్లాల్లోని మైనారిటీ ఓటర్లు తృణమూల్ కాంగ్రెస్ వైపే మొగ్గుచూపారు.

ఇదీ చదవండి : 'నందిగ్రామ్​ గురించి చింతించొద్దు.. తీర్పు ఏదైనా ఓకే'

ప్రయత్నాలు విఫలం

కమలదళం.. బంగాల్ పీఠాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని శాయశక్తులా పోరాడింది. ప్రధాని మోదీ, అమిత్ షాలు వరుస ర్యాలీలు, ప్రచార సభలతో ఓటర్లలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. వీరితో పాటు కైలాశ్ విజయవర్గీయ, బీఎల్ సంతోష్, అరవింద్ మీనన్​, యోగి ఆదిత్యానాథ్ భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు వరుస ర్యాలీలు నిర్వహించారు. ఎలాగైనా బంగాల్​లో పాగా వేయాలన్న ఉద్దేశంతో.. బంగాల్​కు కావాల్సింది 'అత్త' కాదని సరికొత్త నినాదానికి తెర తీసింది భాజపా. అయితే, బంగాల్​ను దక్కించుకునేందుకు కమల దళం చేసిన ప్రయత్నాలు మమతా బెనర్జీకే ఇంకాస్త అనుకూలంగా మారాయని ఫలితాలు చూస్తే అర్థమవుతుంది.

ఇదీ చదవండి : 'కూటమి' బేజారు- కామ్రేడ్లకు ఇక కష్టమే!

కుదేలైన కూటమి

కాంగ్రెస్ కంచుకోటగా భావించే మాల్దా, ముర్షిదాబాద్ లోనూ మమతకే పట్టం కట్టారు ఓటర్లు. ఇక బంగాల్​లో మూడో ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్- లెఫ్ట్ పార్టీల కూటమి.. తమ ఉనికిని కాపాడుకోలేని పరిస్థితిలోకి వెళ్లాయి. కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లు సైతం తృణమూల్ కాంగ్రస్​కే దక్కాయి. వామపక్ష కూటమి మరోసారి తన అస్థిత్వాన్ని కోల్పోయింది.

ఇదీ చదవండి : పోరాటాలే మమత విజయానికి బాటలు

మహిళలకు చేరువై

'ప్రజల వద్దకే పాలన' అనే విధంగా మమత చేసిన కార్యక్రమాలు, పథకాలు ప్రజల దృష్టిని ఆకర్షించాయి. దీదీ చేపట్టిన సామాజిక అభివృద్ధి పథకాలు.. ప్రజల్లో ఆమె స్థానాన్ని మరింత పదిలం చేశాయి. ముఖ్యంగా మహిళల కోసం తీసుకొచ్చిన స్వస్త్య సాతి కార్డు పథకం.. పెద్ద సంఖ్యలో మహిళా ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు సహకరించాయి. బయటి వ్యక్తులు అన్న నినాదాన్ని సైతం ప్రజల్లోకి తీసుకెళ్లటంలో దీదీ సఫలీకృతం అయ్యారు. మరోవైపు 'బంగాల్ కు కావాల్సింది సొంత కూతురే' అన్న నినాదాలతో బంగాల్ ప్రజలకు మరింత చేరువయ్యారు.

ఇదీ చదవండి : చెదిరిన భాజపా 'బంగాల్​' స్వప్నం.. కానీ...

3 నుంచి 80 వరకు

2016 బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం మూడు సీట్లు సాధించిన భాజపా.. 2021 ఎన్నికలకు వచ్చేసరికి దాదాపు 80 సీట్లను కైవసం చేసుకుంది. 2019 లోక్​సభ విజయ మంత్రమే.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతుందని కమలదళం గట్టిగా విశ్వసించింది. కానీ ఈసారి భాజపా అంచనాలు తారుమారయ్యాయి. అయితే మథువా వర్గాన్ని ఆకట్టుకోవటంలో మాత్రం కొంత వరకు విజయం సాధించిందనే చెప్పవచ్చు. మథువా వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్న నదియా, ఉత్తర 24 పరగణాల నియోజకవర్గాల్లోని జల్పాయ్​గుడి, అలీ పుర్దువార్, కూచ్​బిహార్ లాంటి ప్రాంతాల్లో భాజపా ఓట్లు రాబట్టింది. తృణమూల్ కాంగ్రెస్ విజయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. తన అంచనాలను మరోసారి నిజం చేసి చూపించారు.

ఇదీ చదవండి : పీకే పక్కా స్కెచ్​.. మళ్లీ ఐ-ప్యాక్ సూపర్​ హిట్

జాతీయ స్థాయిలో..

బంగాల్ అసెంబ్లీలో మొదటిసారి ప్రతిపక్ష పార్టీగా భాజపా కాలుపెట్టనుంది. వామపక్ష కూటమి మరోసారి తన అస్థిత్వాన్ని కోల్పోయింది. బంగాల్ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించిన మమతా బెనర్జీ.. 2024 వరకు జాతీయ రాజకీయాల్లోనూ అత్యంత క్రియాశీల పాత్రను పోషిస్తారనటంలో ఎలాంటి సందేహం లేదు.

(రచయిత- దీపాంకర్ బోస్, న్యూస్ కోఆర్డినేటర్, ఈటీవీ భారత్)

ఇదీ చదవండి : 'నేను లోకల్​' నినాదంతో మమత తీన్మార్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.