Weekly Horoscope: సెప్టెంబరు 4 నుంచి సెప్టెంబరు 9 వరకు మీ రాశి ఫలాల గురించి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే?
సంపూర్ణవిజయం లభిస్తుంది. ఏకాగ్రతతో పని పూర్తిచేయండి. మీమీద మీకు నమ్మకం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో బాగుంటుంది. ఊహించిన దానికంటే మంచి ఫలితాలే వస్తాయి. ధనయోగం ఉంది. వాదోపవాదాలకు తావివ్వకండి. కొందరు ఈర్ష్యపడతారు. కుజశ్లోకం చదవండి, శుభం జరుగుతుంది.
మంచి ఆలోచనలతో ముందుకు వెళ్లండి. సకాలంలో కార్యసిద్ధి లభిస్తుంది. దైవానుగ్రహం ఉంది. మీ పనులు నలుగురికీ ఉపయోగ పడతాయి. ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధి సూచితం. కుటుంబపరమైన ప్రోత్సాహం లభిస్తుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ బంగారు భవిష్యత్తును అందుకోండి. సూర్యనమస్కారం శక్తినిస్తుంది.
శ్రేష్ఠమైన కాలం. అభీష్టసిద్ధీ, అనేక శుభయోగాలూ ఉన్నాయి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. ఆపదలు తొలగుతాయి. వ్యాపారంలో లాభాలుంటాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. దానధర్మాలు చేసే
అవకాశం లభిస్తుంది. గృహ భూ వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్టదేవతను స్మరించండి, శుభవార్త వింటారు.
శుభఫలితముంది. పట్టుదలతో ముందుకెళ్లండి. ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారబలం ఉంది. ధనధాన్యయోగముంది. పరిస్థితులకు తగినట్లుగా నిర్ణయాలు తీసుకుంటూ లక్ష్యాన్ని చేరాలి. సొంత నిర్ణయం మేలు. ముఖ్యకార్యాల్లో పట్టువిడుపులు అవసరం. విందువినోదాల్లో పాల్గొంటారు. సూర్యస్తుతి మంచిది.
వ్యాపారబలం బాగుంది. లాభాలు ఉంటాయి. ధనధాన్య వృద్ధి సూచితం. మానవ ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో విసుగు లేకుండా పనిచేయాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. సమస్యలను సున్నితంగా పరిష్కరించాలి. వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది. అదృష్టవంతులవుతారు. ఇష్టదేవతను స్మరించండి, సంకల్పం సిద్ధిస్తుంది.
మనోబలం అవసరం. ఉద్యోగంలో కష్టపడాల్సి ఉంటుంది. ఒత్తిడిని తగ్గించుకోవాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చిన్న పొరపాటు జరిగినా సమస్య పెద్దదవుతుంది. చెడు ఆలోచనలు ఇబ్బందిపెడతాయి. ఒంటరిగా ఉండవద్దు. సమష్టి కృషితో మంచి భవిష్యత్తుకు అవకాశముంది. నవగ్రహ శ్లోకాలు చదవండి, మేలు జరుగుతుంది.
ఉద్యోగంలో పనికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. ఆశయం నెరవేరాలంటే చంచలత్వం ఉండకూడదు. తెలియని ఆటంకాలుంటాయి. స్థిరచిత్తంతో ముందడుగు వేయండి. ఆవేశపరిచేవారు ఉన్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. వ్యాపారంలో సమస్యను ఇంట్లోవారి సూచనలతో అధిగమించండి. బాధ్యతలను సమర్థంగా పూర్తిచేయాలి. నవగ్రహస్తుతి మంచిది.
శుభకాలం నడుస్తోంది. విశేషమైన కార్యసిద్ధీ అనేక శుభయోగాలూ ఉన్నాయి. సందర్భానికి తగినట్లుగా ఉపయోగించుకోవాలి. అధికారలాభం సూచితం. మంచి ఫలితాలు సాధించే కాలం కాబట్టి ప్రతి నిమిషాన్నీ సద్వినియోగం చేసుకోవాలి. పలుమార్గాల్లో ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. ఇంట్లో శుభాలు జరుగుతాయి. మహాలక్ష్మీ ఆరాధన మేలు చేస్తుంది.
మంచి అవకాశాలు వస్తాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేసి వాటిని సొంతం చేసుకోవాలి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. తోటివారి ప్రోత్సాహం లభిస్తుంది. విఘ్నం ఒకటి ఎదురవుతుంది. జాగ్రత్తగా అధిగమించాలి. ఆర్థిక నష్టం రాకుండా చూసుకోవాలి. కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే ప్రశాంతత లభిస్తుంది.
ఏకాగ్రచిత్తంతో ముందుకెళ్లాలి. ఏ పనినీ మధ్యలో ఆపవద్దు. చంచలత్వం పనికి రాదు. ఉద్యోగంలో శ్రద్ధ పెంచాలి. అపార్థాలకు తావివ్వవద్దు. అవకాశాల్ని సద్వినియోగం చేసుకోండి. సొంత నిర్ణయం శక్తినిస్తుంది. ఆర్థికంగా మిశ్రమకాలం. రుణం పెరగనివ్వద్దు. ఆదిత్య హృదయం చదవండి, మంచి జీవితం లభిస్తుంది.
అభీష్ట సిద్ధి ఉంది. మనోబలంతో ముందుకు సాగండి, అదృష్టవంతులవుతారు. ఉద్యోగంలో తోటివారి సహకారం అందుతుంది. విఘ్నాలు చికాకు కలిగిస్తాయి. ప్రశాంతంగా ఆలోచించాలి. ఆరోగ్యంపై ఒత్తిడి ప్రభావం చూపుతుంది. బాధ్యతలను సక్రమంగా నిర్వహించండి. వ్యాపారంలో మెలకువలు తెలుసుకోవాలి. ఇష్టదైవ ప్రార్థన చేయండి, శుభవార్త వింటారు.
అభీష్టసిద్ధి ఉంది. ఉద్యోగంలో అభివృద్ధి సూచితం. అనుకున్న సమయానికే పనుల్ని పూర్తిచేస్తారు. స్థిరమైన భవిష్యత్తు లభిస్తుంది. వ్యాపారం మిశ్రమం. మొహమాటంతో అనవసర ఖర్చులు పెడతారు. కొందరివల్ల శ్రమ పెరుగుతుంది. స్పష్టమైన ఆలోచనలతో జాగ్రత్తగా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి. వారాంతానికి శాంతి లభిస్తుంది. దుర్గాపూజ మంచిది.