ETV Bharat / bharat

Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (ఆగస్టు29 -సెప్టెంబర్ ​4)

author img

By

Published : Aug 29, 2021, 4:33 AM IST

ఈ వారం (ఆగస్టు29 - సెప్టెంబర్ ​4) మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే..

Weekly Horoscope
ఈ వారం రాశిఫలం

ఈ వారం (ఆగస్టు29 - సెప్టెంబర్ ​4) రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన సంగతులు మీకోసం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)

మనోధర్మాన్ని అనుసరించండి. సత్ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ఒత్తిడి కలిగించే పరిస్థితులుంటాయి. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. ధర్మమార్గంలో విజయం లభిస్తుంది. వ్యాపార లాభం ఉంటుంది. బంధుమిత్రుల ద్వారా మేలు చేకూరుతుంది. శ్రమ పెరుగుతుంది. ఆంజనేయస్వామిని స్మరించండి, కార్యసిద్ధి ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. సొంత నిర్ణయమే కాపాడుతుంది. ఉద్యోగంలో నైపుణ్యాన్ని ప్రదర్శించండి. ఆందోళన కలిగించే పరిస్థితులు ఎదురవుతాయి. ఓర్పుతో సమాధానమివ్వాలి. వృథా శ్రమ ఉంటుంది. వారం మధ్యలో మేలు జరుగుతుంది. వ్యాపారపరంగా అనుకూల సమయం. ఆర్థికస్థితి బాగానే ఉంటుంది. నవగ్రహశ్లోకాలు చదివితే మంచిది.

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉత్తమకాలం నడుస్తోంది. అన్నివిధాలా కలిసివస్తుంది. బంగారు జీవితానికి పనికొచ్చే ఆలోచనలు చేస్తారు. అర్హతలను బట్టి అదృష్టఫలాలు అందుతాయి. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగరీత్యా మంచికాలం గోచరిస్తోంది. వ్యాపార లాభాలు విశేషం. వారాంతంలో శుభవార్త వింటారు. ఇష్టదేవతాస్మరణతో శాంతి లభిస్తుంది.

కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష)

శుభ ఫలితముంటుంది. మనోబలం ముందుకు నడిపిస్తుంది. బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించే కాలమిది. సుఖసంతోషాలున్నాయి. పట్టువదలని దీక్షతో కృషి చేయండి. వ్యాపార లాభం సూచితం. సమష్టి కృషితో అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. మంచి పనులు చేయటానికి కాలాన్ని వినియోగించాలి. శ్రీగణపతి స్మరణ మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

ఉత్తమకాలం నడుస్తోంది. ధర్మం గెలిపిస్తుంది. పదిమందికీ మంచి చేస్తారు. గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవీలాభముంది. వ్యాపారంలో బాగుంటుంది. ధనధాన్య, గృహ-వాహనాది యోగాలు అనుకూలిస్తాయి. వారం మధ్యలో ఒక పనిలో విజయముంటుంది. బంధుమిత్రులతో ఆనందిస్తారు. ఇష్టదేవతా దర్శనం శ్రేయోదాయకం.

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు; హస్త, చిత్త 1,2 పాదాలు)

ఉద్యోగంలో శ్రద్ధ పెంచితేనే కోరుకున్న ఫలితం లభిస్తుంది. వ్యాపారంలో కొంతవరకు లాభముంటుంది. ఆపదలు తొలగుతాయి. మనోబలం తగ్గకూడదు. అంతా మనమంచికే అన్న ధోరణి ఉత్తమ భవిష్యత్తుకు పునాది వేస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వారాంతంలో శుభవార్త వింటారు. శివస్మరణ విజయాన్నిస్తుంది.

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)

ఉద్యోగంలో అభివృద్ధి సూచితం. బాధ్యతలను శ్రద్ధగా పూర్తి చేయండి. వ్యాపారంలో మిశ్రమ ఫలం గోచరిస్తోంది. ఆర్థికస్థితి బాగుంటుంది. మొహమాటం వల్ల నష్టం జరగవచ్చు. దైవానుగ్రహంతో ఒక పని అవుతుంది. నూతనాంశాలపై పట్టు లభిస్తుంది. ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఇష్టదైవాన్ని ధ్యానించండి, శాంతి చేకూరుతుంది.

వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ)

ఉత్తమకాలం నడుస్తోంది. కోరికలు నెరవేరతాయి. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. సరైన కార్యాచరణతో స్థిరమైన ఫలితాలు వస్తాయి. అదృష్టయోగం ఉంటుంది. వ్యాపార లాభం విశేషంగా ఉంటుంది. అన్నివిధాలా సర్వోత్తమమైన కాలమిది. పెద్దలు మీ ప్రతిభను గుర్తిస్తారు. పలుమార్గాల్లో విజయం లభిస్తుంది. ఇష్టదైవాన్ని స్మరిస్తే మేలు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)

కర్తవ్య నిర్వహణలో ధర్మబద్ధంగా వ్యవహరించండి. ఉద్యోగంలో ఓర్పు అవసరం, సహనాన్ని పరీక్షించేవారుంటారు. శాంతచిత్తంతో వ్యవహరించాలి. వ్యాపారంలో జాగ్రత్త. ఆర్థికనష్టం జరగకుండా చూసుకోవాలి. ముందస్తు ప్రణాళికలతో కార్యసిద్ధి ఉంటుంది. మిత్రుల సూచనల వల్ల ఆటంకాలు తొలగుతాయి. నవగ్రహశ్లోకాలు చదివితే మంచిది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు)

ఉద్యోగంలో ఏకాగ్రతతో పనిచేసి ప్రశంసలు పొందుతారు. క్రమంగా స్థిరత్వం ఏర్పడుతుంది. వ్యాపారంలో ధనలాభముంటుంది కానీ బాగా శ్రమించాలి. కొందరివల్ల ప్రశాంతత లోపిస్తుంది. ధ్యానమార్గంలో ముందుకు సాగండి. మనశ్శాంతి లభిస్తుంది. భవిష్యత్తు అనుకూలం. శుభవార్త వింటారు. సూర్యనారాయణమూర్తిని స్మరించండి, ఆనందం లభిస్తుంది.

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

మనోబలంతో విజయం సాధిస్తారు. అభీష్టసిద్ధి కలుగుతుంది. వ్యాపారలాభముంటుంది. ఉద్యోగంలో శ్రమ పెరిగినా తగిన ప్రతిఫలం లభిస్తుంది. వివాదాలకు అవకాశముంది. సౌమ్యంగా సంభాషించండి. మిత్రుల అండతో సమాజంలో గుర్తింపు పొందుతారు. బాధ్యతలు పెరుగుతాయి. అదృష్టవంతులవుతారు. శివస్మరణతో శాంతి లభిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో తగినంత గౌరవం, గుర్తింపు లభిస్తాయి. కాలం సహకరిస్తోంది. వ్యాపారం లాభ దాయకం. శ్రేష్ఠమైన జీవితం లభిస్తుంది. ఉపకారబుద్ధితో ముందుకు సాగాలి. ధర్మం రక్షిస్తుంది. చంచలత్వం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. ఆపదలు తొలగుతాయి. పూర్వపుణ్యం రక్షిస్తోంది. ఇష్టదైవాన్ని మనసులో తలచుకోండి, అంతా మంచే జరుగుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.