ETV Bharat / bharat

'టపాసులంటే భయం- తుపాకీ ఎలా కాల్చాడు?'- 'బద్లాపుర్' హత్యాచారం నిందితుడి మృతిపై CID విచారణ - Badlapur case CID Investigation

Badlapur Case Accused Death CID Investigation : పోలీసుల కాల్పుల్లో బద్లాపుర్‌ లైంగిక వేధింపుల కేసులో నిందితుడి మృతిపై దర్యాప్తు చేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్ల నేపథ్యంలో నేర పరిశోధన విభాగం-CID రంగంలోకి దిగింది. నిందితుడు అక్షయ్‌ శిందే మృతిపై మహారాష్ర్ట CID దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులను CID విచారించనుంది. మరోవైపు, తమ కుమారుడి మృతిపై విచారణ చేయాలని నిందితుడు కుటుంబం డిమాండ్‌ చేసింది. తమ కుమారుడు టపాసులు పేల్చడానికే భయపడతాడని, అలాంటిది పోలీసులు నుంచి తుపాకీని ఎలా లాక్కున్నాడని కుటుంబ సభ్యులు ప్రశ్నించారు.

Badlapur Case Accused Death CID Investigation
Badlapur Case Accused Death CID Investigation (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2024, 4:50 PM IST

Updated : Sep 24, 2024, 4:58 PM IST

Badlapur Case Accused Death CID Investigation : మహారాష్ట్ర బద్లాపుర్‌ లైంగిక వేధింపుల కేసులో నిందితుడి మృతిపై అనుమానాలు నెలకొన్న వేళ నేర పరిశోధన విభాగం-CID రంగంలోకి దిగింది. ఈ కేసును మహారాష్ట్ర CID బృందం దర్యాప్తు చేస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. బద్లాపుర్‌లోని ఓ పాఠశాలలో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు అక్షయ్‌ శిందే సోమవారం పోలీసుల ఎదురుకాల్పుల్లో మృతి చెందాడు. విచారణ నిమిత్తం తలోజా జైలు నుంచి పోలీస్‌ వాహనంలో బద్లాపుర్‌ తరలిస్తుండగా- ముంబ్రా బైపాస్‌కు చేరుకున్న సమయంలో పోలీసు అధికారి తుపాకీని లాక్కున్న అక్షయ్‌ వారిపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో అప్రమత్తమైన మరో పోలీసు అధికారి నిందితుడిపై కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో అక్షయ్‌తోపాటు పోలీసులు గాయపడ్డారు. తీవ్ర గాయాలపాలైన నిందితుడిని ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. నిందితుడు మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్ష కోసం ఠాణె నుంచి ముంబయిలోని JJ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శవపరీక్ష దృశ్యాలను చిత్రీకరించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తునకు ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్న వేళ, ఈ కేసులో మహారాష్ట్ర CID బృందం విచారణ ప్రారంభించింది. నిందితుడు అక్షయ్‌ మృతికి సంబంధించి పోలీసుల వాహనాన్ని ఫోరెన్సిక్ సైన్స్ నిపుణుల బృందం పరిశీలించింది. ముంబ్రా బైపాస్‌ ప్రాంతం వద్ద ఘటనా స్థలాన్ని సీఐడీ బృందం పరిశీలించనుంది. ఆ సమయంలో వాహనంలో ఉన్న పోలీస్‌ సిబ్బంది వాంగ్మూలాలను తీసుకోనున్నారు. అలాగే నిందితుడి తల్లిదండ్రులు వాంగ్మూలాన్ని సీఐడీ బృందం నమోదు చేయనుంది.

'టపాసులకే భయపడతాడు- తుపాకీ ఎలా కాల్చాడు?'
తమ కుమారుడి మృతిపై నిందితుడి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. అక్షయ్‌ మృతిపై విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. తమ కుమారుడి హత్య వెనుకు పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. తమ కుమారుడు అక్షయ్‌ ఒంటరిగా రోడ్డు దాటడానికి కూడా భయపడతాడని నిందితుడి తల్లి అల్కా శిందే చెప్పారు. అక్షయ్‌ టపాసులు పేల్చడానికే భయపడతాడని, అలాంటిది పోలీసులు నుంచి తుపాకీని ఎలా లాక్కున్నాడని ప్రశ్నించారు.

ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. బీజేపీ, RSSతో సంబంధాలు ఉన్న ఆ పాఠశాల యాజమాన్యాన్ని కాపాడేందుకే పోలీసులు నకీలీ ఎన్‌కౌంటర్‌ చేశారని మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నానా పటోలే ఆరోపించారు. ఈ కేసును బాంబే హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనలో పోలీసుల చర్యలపై అనుమానాలు ఉన్నాయని NCP శరద్‌ పవార్‌ వర్గం ఆరోపించింది. ఆత్మరక్షణ కోసం కాల్చి చంపినట్లు పోలీసులు చెబుతున్నారని, అయితే చేతికి సంకెళ్లు ఉన్న వ్యక్తి తుపాకీని ఎలా లాక్కున్నాడని NCP నేత జితేంద్ర అవద్‌ ప్రశ్నించారు.

ఈ ఏడాది ఆగస్టులో బద్లాపుర్‌ కిండర్‌గార్టెన్‌ స్కూల్‌లో అటెండర్‌గా పనిచేసిన సమయంలో అక్షయ్‌ టాయిలెట్‌లో ఇద్దరు నర్సరీ చిన్నారులపై లైంగికదాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పిల్లలు స్కూల్‌కు వెళ్లేందుకు భయపడటం వల్ల తల్లిదండ్రులు ఆరా తీయగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణం దేశవ్యాప్తంగా ఆగ్రహం తెప్పించింది.

పోలీసుల ఎదురుకాల్పుల్లో 'బద్లాపుర్​' అత్యాచార నిందితుడు హతం

బాలికలపై స్కూల్ అటెండర్ లైంగిక వేధింపులు- హింసాత్మకంగా మారిన నిరసనలు - రైల్వేస్టేషన్​పై రాళ్ల దాడి - Badlapur Girls Sexually Assault

Last Updated : Sep 24, 2024, 4:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.