ETV Bharat / state

హైదరాబాద్‌లో మరోసారి భారీవర్షం - అవసరమైతే తప్ప బయటకు రావొద్దు : జీహెచ్​ఎంసీ - Hyderabad Rains Updates - HYDERABAD RAINS UPDATES

Hyderabad Rains : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వరుణుడు పలకరించడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందుగా మేడ్చల్ జిల్లాలో ప్రారంభమైన వర్షం క్రమంగా నగరం అంతటా విస్తరించింది. వర్షానికి ఈదురుగాలులు తోడవటంతో అక్కడక్కడా చెట్లు కూలతున్నాయి. సికింద్రాబాద్​ మొండా మార్కెట్‌లోని ఓల్డ్ జైల్ ఖానా ప్రహారి గోడ కూలి ఒకరికి గాయాలయ్యాయి.

Heavy Rains in Hyderabad
Hyderabad Rains (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 24, 2024, 4:26 PM IST

Updated : Sep 24, 2024, 7:47 PM IST

Heavy Rains in Hyderabad : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగరంలోని సుచిత్ర, గుండ్లపోచంపల్లి, బహదూర్‌పల్లి, సూరారం, కొంపల్లి, చింతల్‌, కండ్లకోయ, కృష్ణాపూర్, దుండిగల్, గాగిల్లాపూర్, గౌడవల్లి, మునీరాబాద్, డబిల్‌పూర్‌లలో ఒక్కసారిగా కురిసిన వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షానికి ఈదురుగాలులు కూడా తోడయ్యాయి. ఫలితంగా పలుచోట్ల చెట్లు కూలిపోయాయి. ముందే సమాచారం ఉన్న జీహెచ్​ఎంసీ సిబ్బంది, డీఆర్​ఎఫ్ సిబ్బంది రహదారులకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించే పనిలో ఉన్నారు. పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితులను చక్కదిద్దుతున్నారు.

అకస్మాత్తుగా కురిసిన భారీవర్షం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట, బోరబండ, ఈఎస్ఐ, మియాపూర్, చందానగర్, లింగంపల్లిలో ఇంటికి వెళ్లే వారికి ఇబ్బందులకు గురిచే సింది. అటు కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గంతో పాటు రామంతపుర్, ఉప్పల్, పెద్దఅంబర్‌పేట, హయత్‌నగర్‌ ప్రాంతాల్లో వర్షం పడింది. ఫలితంగా ఈ ప్రాంతాల్లో రహదారులపై వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. ట్రాఫిక్​లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు వదిలే సమయంలో కావడంతో రోడ్లపై రద్దీ పెరిగిపోయింది.

మరోవైపు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మొండా మార్కెట్​ ఓల్డ్ జైల్ ఖానా ప్రహరీ గోడ కూలింది. ఈ ఘటనలో ఐదు దుకాణాలు ధ్వంసం కాగా ఒకరికి గాయాలు అయ్యాయి. ప్రహరీగోడ మట్టిపెళ్లలు పడడంతో ఐదు ట్రైలర్ దుకాణాలు, ఒక పూల దుకాణం దెబ్బతిన్నాయి.

4 రోజుల పాటు భారీ వర్షాలు : ఇదిలా ఉండగా రాష్ట్రంలో రానున్న 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం గంటకు 40 నుంచి 50 కి.మీ, గురువారం 30 నుంచి 40 కి.మీ వేగంతో అక్కడక్కడ గాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది. మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది.

ఉక్కపోత నుంచి ఉపశమనం : యాదాద్రి ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు యాదగిరిగుట్టలో సుమారు 2 గంటల పాటు ఓ మోస్తరు వర్షం కురిసింది. ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా పలు మండలాల్లోనూ వాన పడగా, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. వాగులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. మరోవైపు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు.

కరీంనగర్‌లో కురిసిన భారీ వర్షానికి నగర ప్రజలకు ఉపశమనం లభించింది. గత వారం రోజులుగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పట్టణ ప్రజలకు, ఈరోజు కురిసిన భారీ వర్షంతో ఉపశమనం లభించింది. గత రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు రావడంతో పట్టణంలో చల్లదనం నెలకొంది. గంటసేపు కురిసిన భారీ వర్షానికి మురుగు కాలువలు పొంగిపొర్లాయి.

హైదరాబాద్​లో దంచికొట్టిన వాన - ప్రధాన రహదారులన్నీ జలమయం - Heavy Rains in Hyderabad

రాష్ట్రానికి మరోసారి రెయిన్​ అలర్ట్​ - ఆ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం! - Rain Alert in Telangana Today

Last Updated : Sep 24, 2024, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.