ETV Bharat / bharat

Weekly Horoscope (ఏప్రిల్‌ 24- 30): ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే? - గ్రహం అనుగ్రహం

Weekly Horoscope: ఈ వారం (ఏప్రిల్‌ 24- 30) మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే..

రాశిఫలాలు
రాశిఫలాలు
author img

By

Published : Apr 24, 2022, 4:05 AM IST

Weekly Horoscope: ఈ వారం (ఏప్రిల్‌ 24- 30) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

.

ఉద్యోగంలో శుభ ఫలితముంది. ధర్మమార్గాన్ని అనుసరించాలి. ముందస్తు ప్రణాళికలతో పనిచేస్తే అభివృద్ధిని సాధిస్తారు. మనోబలం అవసరం. తొందర నిర్ణయాలు వద్దు. వ్యాపార నష్టం సూచితం. జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆవేశపరిచే సంఘటనలు చోటుచేసుకుంటాయి. వారాంతంలో లక్ష్యం నెరవేరుతుంది. సూర్యనారాయణమూర్తిని స్మరిస్తే మంచిది.

.

ముఖ్యకార్యాల్లో విజయముంటుంది. ఉద్యోగంలో కీర్తీ హోదా లభిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారంలో కొంత శ్రద్ధ అవసరం. మొహమాటం వల్ల సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. అపోహలు తొలగుతాయి. ధైర్యంగా సమస్యలను పరిష్కరించాలి. నవగ్రహశ్లోకాలు చదవండి, మనోబలం వస్తుంది.

.

వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నత స్థితి లభిస్తుంది. శ్రేష్ఠమైన ఫలితాలుంటాయి. నూతనాంశాలు తెలుస్తాయి. ప్రయత్నాలు సఫలమవుతాయి. కోరుకున్న జీవితం లభిస్తుంది. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. సంతృప్తికర ఫలితాలను సాధిస్తారు. వ్యాపారం చాలా బాగా కలిసి వస్తుంది. లక్ష్మీ కటాక్షసిద్ధి ఉంది. దత్తాత్రేయ ధ్యానం శుభప్రదం.

.

ఎటుచూసినా విజయమే గోచరిస్తోంది. సకాలంలో పని ప్రారంభించండి. మంచి జరుగుతుంది. అనుకున్నది సాధిస్తారు. నైపుణ్యం పెరుగుతుంది. బంధుమిత్రుల నుండి ప్రోత్సాహముంటుంది. గృహ వాహనాది ప్రయత్నాలు ఫలిస్తాయి. వస్తు వస్త్రప్రాప్తి ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో విశేష ఫలితాలుంటాయి. ఇష్టదైవ దర్శనం మేలుచేస్తుంది.

.

పట్టుదలతో పనిచేయండి. తప్పక విజయం ఉంటుంది. ఆత్మవిశ్వాసం సడలకూడదు. ధర్మచింతన విఘ్నాల నుండి రక్షిస్తుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించండి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడాలి. కొత్త ప్రయత్నాలు అంతగా ఫలించవు. కుటుంబసభ్యుల సలహాలు అవసరం. వారాంతంలో శుభం జరుగుతుంది. ఇష్టదేవతను దర్శిస్తే మంచిది.

.

సకాలంలో పని ప్రారంభించండి. ఉద్యోగంలో సత్ఫలితాలు ఉంటాయి. ఉత్సాహంగా సంకల్పాన్ని నెరవేర్చండి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. మేలు చేసేవారున్నారు. ధన లాభముంది. చంచలత్వం వల్ల ఒత్తిడి, శ్రమ పెరుగుతాయి. రుణ సమస్యలు రానివ్వవద్దు. సమష్టి కృషి ఫలిస్తుంది. ఆదిత్యహృదయం చదవండి, మనశ్శాంతి లభిస్తుంది.

.

ప్రతి పనీ శ్రద్ధగా చేయాలి. ఆటంకాలు ఎదురైనా పనులను వాయిదా వేయవద్దు. ఉద్యోగంలో ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి. అపార్థాలకు తావివ్వవద్దు. అవమానాలను ఎదుర్కొన్నా చివరికి విజయం లభిస్తుంది. స్నేహితులవల్ల ఉపకారముంటుంది. వ్యాపారంలో కష్టపడాలి. ఆర్థికస్థితి బాగుంటుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే మేలు జరుగుతుంది.

.

శ్రేష్ఠమైన కాలం నడుస్తోంది. ఏ పని తలపెట్టినా విజయం లభిస్తుంది. ధర్మదేవతానుగ్రహసిద్ధి ఉంది. ప్రశంసలుంటాయి. పనులు సకాలంలో పూర్తవుతాయి. నూతన ప్రయత్నాలు ఆనందాన్నిస్తాయి. ఇంటా బయటా కలిసి వస్తుంది. సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది. నలుగురికీ మేలు చేస్తారు. కీర్తిని పొందుతారు. ఇష్టదైవాన్ని దర్శించండి, సంకల్పసిద్ధి ఉంటుంది.

.

దైవబలంతో పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికార లాభముంటుంది. అనుకున్న స్థాయికి ఎదుగుతారు. అపోహలు తొలగి మిత్రత్వం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో స్వతంత్రంగా వ్యవహరించాలి. బంధువుల ద్వారా ఆనందం లభిస్తుంది. విఘ్నాలు తొలగుతాయి. వ్యాపారం అనుకూలిస్తుంది. ఆదిత్య హృదయం చదవండి, కృషి ఫలిస్తుంది.

.

చక్కని విజయాలున్నాయి. వ్యాపార లాభముంటుంది. ఉద్యోగంలో పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఇంట్లోవారితో చెప్పి తీసుకునే నిర్ణయాలు కలిసివస్తాయి. భవిష్యత్తుకు అవసరమైన ప్రయత్నాలు ప్రారంభించండి. అదృష్టవంతులవుతారు. ఆర్థిక వృద్ధి శుభప్రదం. సూర్యనారాయణ మూర్తిని స్మరించండి, అన్ని రకాల ఇబ్బందులు తొలగుతాయి.

.

ఉద్యోగంలో ఉన్నతస్థితి గోచరిస్తోంది. సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. వ్యాపార లాభముంది. బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. వారం మధ్యలో పూర్తయ్యే ఒక పని ఆనందాన్నిస్తుంది. నూతన వస్తు వస్త్ర లాభాలు ఉంటాయి. అభిమానించేవారున్నారు. ఇష్టదైవాన్ని స్మరించండి, శాంతి లభిస్తుంది.

.

వ్యాపారబలం విశేషంగా ఉంది. ప్రశంసలు పొందుతారు. సమస్యల నుంచి త్వరగా బయటపడతారు. సొంత నిర్ణయం మేలుచేస్తుంది. ఉద్యోగంలో శ్రద్ధ పెంచండి. కలహాలకు అవకాశమివ్వవద్దు. తొందర పనికిరాదు. ధర్మమార్గంలో ముందుకెళ్లాలి. ఖర్చు పెరగనివ్వద్దు. ఇంట్లోవారితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. సూర్యస్తుతి శుభప్రదం.

ఇదీ చూడండి : హనుమాన్ చాలీసా సవాల్​.. ఎంపీ నవనీత్ కౌర్​ దంపతుల అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.