ETV Bharat / bharat

Weekly Horoscope From 3rd To 9th September : ఆ రాశి వారికి పదోన్నతి లభించే అవకాశం ఉంది! - ఈ వారం ఫలాలు

Weekly Horoscope From 3rd To 9th September : సెప్టెంబర్​ 3 నుంచి సెప్టెంబర్​ 9 వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

Weekly Horoscope in Telugu
Weekly Horoscope From 3rd To 9th September
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 3, 2023, 6:21 AM IST

Weekly Horoscope From 3rd To 9th September : సెప్టెంబర్​ 3 నుంచి సెప్టెంబర్​ 9 వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ వారం అంతా బాగుంటుంది. కొత్త శక్తి లభిస్తుంది. కానీ ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, దాని మంచి, చెడుల గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఆ తర్వాత మాత్రమే ఏదైనా పని ప్రారంభించాలి. వివాహితులు తమ గృహ జీవితంతో సంతృప్తికరంగా ఉంటారు. జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. ప్రేమికులకు అనుకూలంగా ఉంటుంది.మీకు పదోన్నతి లభించే అవకాశం కూడా ఉంది. కనుక మీ పనిని మరింత మెరుగ్గా చేసేందుకు ప్రయత్నించాలి. కొన్ని కొత్త పరిచయాల వల్ల వ్యాపారంలో ప్రయోజనం పొందుతారు. మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఫలితంగా విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. ఇంట్లో అంతా ఆనందంగా ఉంటుంది. వాహనం కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది.

.

వృషభం (Taurus) : ఈ వారం వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వివాహితులు గృహ జీవితంలో సంతోషంగా గడుపుతారు. దంపతుల మధ్య పరస్పర అవగాహన బాగుంటుంది. ప్రేమ జీవితం బాగుంటుంది.. కానీ గిల్లికజ్జాలు ఉంటాయి. స్నేహితుల సహకారంతో ఏదైనా కొత్త పని చేపట్టవచ్చు. ఉద్యోగంలో పూర్తి ఉత్సాహంతో పని చేస్తారు. కానీ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. విద్యార్థుల పరిస్థితి మధ్యస్థంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తే పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీరు ఆసుపత్రిలో చేరే అవకాశం ఉంటుంది. కనుక ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

.

మిథునం (Gemini) : ఈ వారం మిథునరాశి వారికి బాగానే ఉంటుంది. వివాహితులు వారి గృహ జీవితంలో మంచి క్షణాలను ఆస్వాదిస్తారు. మీ జీవిత భాగస్వామితో మీ వ్యక్తిగత అవగాహన కూడా బాగానే ఉంటుంది. ప్రేమికులకు ఈ వారం సాధారణంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీ పనిలో చాలా వేగం ఉంటుంది.. ఇది మీ సామర్థ్యాన్ని గురించి తెలియజేస్తుంది. మీ యజమాని మీ పని విధానాన్ని అభినందిస్తారు. ఇది మీ పరిస్థితిని మెరుగుపరుస్తుంది. వ్యాపారస్తులు ఇప్పుడు తమ పనిపై దృష్టి పెట్టాలి. విద్యార్థులు ఉన్నత విద్యలో రాణిస్తారు. కానీ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

.

కర్కాటకం (Cancer) : ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ వారం వివాహితులకు చాలా శుభకరంగా ఉంటుంది. గృహ జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు. ప్రేమికుల మాత్రం కాస్త మధ్యస్థంగా ఉంటుంది. ముఖ్యంగా మీ సంబంధంలో ఇతర వ్యక్తుల జోక్యాన్ని ఏ మాత్రం అనుమతించకూడదు. వృత్తి జీవితంలో కాస్త ఒత్తిడి ఏర్పడవచ్చు. కనుక కాస్త జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం విషయంలో భాగస్వాములను చేర్చుకోకపోవడం మంచిది. ప్రభుత్వ రంగం నుంచి మంచి ప్రయోజనాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం విద్యార్థులకు కలిసి వస్తుంది. ముఖ్యంగా వారి కష్టానికి తగిన ఫలితాలు అందుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.

.

సింహం (Leo) : ఈ వారం సింహ రాశి వారికి అంత అనుకూలంగా లేదు. వివాహితులకు ఈ వారం కాస్త బలహీనంగా ఉంటుంది. అభిప్రాయ భేదాల కారణంగా కొంత భార్యాభర్తల మధ్య ఉద్రిక్తత పెరగవచ్చు. అందుకే సమస్యలను సామర్యంగా పరిష్కరించుకోవాలి. ఉద్యోగస్తులకు ఈ వారం మంచిది. మీ కృషి విజయవంతమవుతుంది. వ్యాపారం చేస్తున్న వ్యక్తులు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశాన్ని పొందుతారు. ఇది మీకు పెద్ద లాభాన్ని ఇస్తుంది. మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మానసిక ఒత్తిడి మిమ్మల్ని వేధిస్తుంది. అది మీ ఆరోగ్యంతో పాటు మీ ముఖ్యమైన కార్యకలాపాలను పాడు చేస్తుంది.

.

కన్య (Virgo) : ఈ వారం కన్య రాశి వారికి మధ్యస్థంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో ఒత్తిడిని అధిగమించడానికి, పెద్దలతో కలిసి ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. వివాహితులు గృహ జీవితంలోని ఒత్తిడి నుంచి నెమ్మదిగా బయటపడతారు. పరస్పర సమన్వయాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. ప్రేమ జీవితాన్ని ఆస్వాదించాల్సిన సమయం ఇది. మీ ఆలోచన పూర్తిగా సరైన దిశలో లేకపోవటం వల్ల మీ మనస్సులో కొంత గందరగోళం ఏర్పడుతుంది. ఈ వారం కొన్ని ముఖ్యమైన పనులకు ఆటంకం కలగవచ్చు. వ్యాపారులకు ఈ వారం అంత అనుకూలంగా లేదు. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. విద్యార్థులు చదువుల్లో బాగా రాణించగలుగుతారు.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. ప్రేమికులకు మాత్రం ఏమాత్రం అనుకూలంగా లేదు. మీరు జాగ్రత్తగా ఉండాలి.. లేకపోతే సంబంధం విచ్ఛిన్నం కావచ్చు. ఉద్యోగస్తుల పరిస్థితి బాగుంటుంది. విద్యార్థులు చదువులో ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే చదువుపై దృష్టి పెట్టాలి. ఆరోగ్యం విషమించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కనుక ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి. వారంలో చివరి రెండు రోజులు ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి.

.

వృశ్చికం (Scorpio) : ఈ వారం వృశ్చిక రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. వివాహితులకు మంచి గృహ జీవితం ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సాన్నిహిత్యం, అవగాహన పెరుగుతుంది. ప్రేమికుల జీవితం ఈ వారం సాధారణంగా గడుస్తుంది. వ్యాపారాలు, పెట్టుబడులు పెడితే.. నష్టపోయే ప్రమాదం ఉంది. మీ డబ్బును ఎవరికీ అప్పుగా కూడా ఇవ్వకూడదు. ఉద్యోగస్తులకు ఈ వారం చాలా బాగుంటుంది. మీరు కొన్ని పనులకు ప్రశంసలు పొందవచ్చు. మీరు కొన్ని కొత్త ప్రాజెక్ట్‌లను కూడా పొందవచ్చు. ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. మీరు కొంత మంది కొత్త వ్యక్తులతో పనిని ముందుకు తీసుకువెళతారు. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. వ్యాపారం చేసే వ్యక్తులు ఏదైనా పని కోసం సుదీర్ఘ ప్రయాణం చేయవలసి వస్తుంది. విద్యార్థులకు కొన్ని ఆటంకాలు ఎదురైనా.. తమ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. మీ జీవిత భాగస్వామితో గొడవపడే అవకాశం ఉంది. ఇది మీ మధ్య దూరాన్ని పెంచే అవకాశం ఉంది. ప్రేమికులు హాయిగా కాలం గడుపుతారు. కానీ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం కూడా ఉంది. మీ కుటుంబ సభ్యుల కోసం ఏదైనా మంచి చేయాలనే కోరిక మీకు ఉంటుంది. రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన విషయాలు మీ దృష్టిని ఆకర్షిస్తాయి. ఉద్యోగంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కానీ ఎవరితోనైనా తప్పుగా మాట్లాడటం మీకు హానికరం. అయితే అదృష్టం మీ వెంట ఉంటుంది. దీని కారణంగా ఉద్యోగంలో పదోన్నతి పొందే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని పెద్ద ఒప్పందాలు చేసుకుంటారు. దీని వల్ల మీకు లాభం చేకూరుతుంది. విద్యార్థులు చదువు విషయంలో చాలా శ్రద్ధగా ఉంటారు. మీ స్నేహితుల నుంచి కూడా మంచి మద్ధతు పొందుతారు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

.

మకరం (Capricorn) : ఈ వారం మకరరాశి వారికి బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కుటుంబ బాధ్యతలు నెరవేరుతాయి. మీరు మీ తల్లి నుంచి కూడా ఆశీర్వాదం పొందుతారు. దీని కారణంగా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ప్రేమ జీవితానికి కూడా సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు తమ పనిలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. వ్యాపారులు లాభాలను పొందుతారు. మీ వ్యాపారానికి మద్దతు ఇచ్చే కొంత మంది ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రభుత్వ రంగం నుండి ఏదైనా నోటీసు రావచ్చు. పిల్లలకు సమయం శుభప్రదం. విద్యార్థుల గురించి చెప్పాలంటే ఇప్పుడు చదువులో మంచి ఫలితాలు వస్తాయి. మీరు చదువుపై దృష్టి పెడతారు. ఇది మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. కానీ బయట తినకుండా ఉండటం అవసరం.

.

కుంభం (Aquarius) : ఈ వారం కుంభ రాశి వారికి బాగానే ఉంటుంది. వివాహితులు వారి గృహ జీవితంలో మంచి అనుభూతిని పొందుతారు. మీ జీవిత భాగస్వామితో అనుబంధం మెరుగుపడుతుంది. ప్రేమికులకు అంతా కలిసి వస్తుంది. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా విహారం చేస్తారు. ఉద్యోగులకు ఈ వారం అంత అనుకూలంగా లేదు. కానీ బాగా కష్టపడితే.. తప్పకుండా విజయం సాధిస్తారు. మీ పెట్టుబడి కూడా మీకు మంచి లాభాన్ని ఇస్తుంది. వ్యాపార పురోగతిలో ఒక ప్రత్యేక వ్యక్తి సహకారం మీకు లభిస్తుంది. విద్యార్థుల చదువులు మధ్యస్థంగా ఉంటాయి. మీరు ఈ వారం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అవసరం.

.

మీనం (Pisces) : ఈ వారం మీనరాశి వారికి సాధారణంగా ఉంటుంది. గృహస్థ జీవితంలో ఆనందాన్ని పొందుతారు. ఆస్తి వివాదాలు జరిగే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ప్రేమికులు ఆహ్లాదకరంగా గడుపుతారు. ఏదైనా ఆలయానికి విరాళం ఇస్తే మీకు బాగుంటుంది. ఇది మీకు శాంతిని ప్రసాదిస్తుంది. సమాజంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది. ఈ వారం మీ ఆదాయం కూడా పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త ఫలితాలు కనిపిస్తాయి. ప్రత్యర్థులపై మీరు విజయం సాధిస్తారు. కోర్టు కేసుల్లోనూ విజయం పొందుతారు. విద్యార్థులకు కలిసి వస్తుంది. ఆరోగ్యంలో కొంత మెరుగుదల ఉంటుంది. మీరు ప్రయాణం చేయాలనుకుంటే, వారంలోని చివరి రోజులు అనుకూలంగా ఉంటాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.