ETV Bharat / bharat

Weekly Horoscope From 13th to 19th August : ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే? - ఈ వారం ఫలాలు

Weekly Horoscope From 13th to 19th August In Telugu : ఆగస్టు 13 నుంచి ఆగస్టు 19 వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

Weekly Horoscope From 13th to 19th August
Weekly Horoscope in telugu
author img

By

Published : Aug 13, 2023, 6:38 AM IST

Weekly Horoscope From 13th to 19th August In Telugu : ఆగస్టు 13 నుంచి ఆగస్టు 19 వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారు ఈ వారం ఒక చిన్న ప్రయాణం చేయడానికి ప్రయత్నించండి. ఇది మీకు సరికొత్త ఉత్తేజాన్ని, శక్తిని ఇస్తుంది. ముఖ్యమైన వ్యాపారాల్లో లాభాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు బాగా కృషి చేస్తారు. మీరు కష్టపడి పనిచేయడాన్ని సీనియర్లు కూడా అభినందిస్తారు. వివాహితులకు వారి వివాహంలో సంతృప్తి లభిస్తుంది. కానీ అసభ్యకరమైన బహిరంగ ప్రకటనలు, వ్యాఖ్యల కారణంగా వారు సమస్యలను ఎదుర్కొంటారు. వారిని ఒప్పించడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈ వారం విద్యార్థులకు చాలా బాగుంటుంది. అందుకే వీరు అధ్యయనాలపై మరింత దృష్టి కేంద్రీకరించాలి. ఈ వారంలో మొదటి భాగంలో ప్రయాణాలు చేయడం లాభసాటిగా ఉంటుంది. అయితే మీ ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి.

.

వృషభం (Taurus) : ఈ వారం వృషభ రాశి వారికి మంచిది. కానీ ఇంట్లో ఎక్కువ ఘర్షణ ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది. మీ తల్లి ఆరోగ్యం క్షీణించవచ్చు. తండ్రితో విభేదాలు రావచ్చు. స్నేహితుడితో మాట్లాడిన ఏదైనా ప్రైవేట్ విషయం చాలా ఖరీదైనది కావచ్చు. ఉద్యోగం ఉన్నవారికి ఈ వారం కష్టమవుతుంది. ఒక అవివేకి చెప్పిన మాటలు విని, వేరొకరితో గొడవ పడవచ్చు. వ్యాపారానికి సమయం అనుకూలంగా ఉంది. మీరు అంతర్జాతీయ వాణిజ్యం వల్ల ప్రయోజనం పొందుతారు. వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే.. ఇది వివాహం చేసుకోవడానికి అద్భుతమైన సమయం. కానీ మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రేమ జీవితం విషయంలో సమయం అనుకూలంగా ఉంది. మీరు చాలా ప్రయోజనకరమైన పరిస్థితిలో ఉంటారు. వివాహితులు పిల్లల కోసం ప్రయత్నం చేయవచ్చు. మీ ఆరోగ్యాన్ని బాగా చూసుకోండి.

.

మిథునం (Gemini) : ఈ వారం మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు ముఖ్యమైన నగదు లాభాలు పొందవచ్చు. కుటుంబ సభ్యులు కూడా మీకు డబ్బు ఇస్తారు. లేదా మీరే మీ తండ్రికి ఆర్థిక సహాయం చేస్తారు. అదృష్టం గెలుస్తుంది. ఉద్యోగంలో మీరు విజయం సాధిస్తారు. మీకు కొత్త పనులు అప్పగిస్తారు. ఇది మీ స్థానం, ప్రతిష్ఠలను పెంచుతుంది. మీరు వ్యాపారంలో ఉన్నట్లయితే, ఇప్పుడు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి సరైన సమయం. ఇందు కోసం కృషి చేయండి. వివాహితులు తమ భాగస్వామి నుంచి కొన్ని కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. అందమైన ప్రదేశానికి కలిసి ప్రయాణించేందుకు ప్రణాళికలు వేస్తారు. ప్రేమ జీవితం బాగుంటుంది. మీరు మీ ప్రయత్నాలను వేగవంతం చేయవచ్చు. మీ భాగస్వామిని వివాహం కోసం ఒప్పించడంలో విజయవంతం కావచ్చు. విద్యార్థులు పుష్కలంగా అధ్యయన సమయం కలిగి ఉంటారు. ఈ వారం ప్రయాణానికి అనువైనది.

.

కర్కాటకం (Cancer) : ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు మీ ఉద్యోగంలో మంచి స్థానంలో ఉంటారు. వారం ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు, ఖర్చులు ఉంటాయి. కానీ అవి వారం మధ్యలో తగ్గుతాయి. ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ, అందుకు తగ్గ ఆదాయం కూడా వస్తుంది. ఇది మీ ఆందోళనలను తగ్గిస్తుంది. మీరు చాలా సంతృప్తిగా కనిపించేలా చేస్తుంది. కొత్త పని పద్ధతులను ప్రయత్నించడానికి ఇది సరైన సమయం. మీకు కొన్ని కొత్త పనులు అప్పగిస్తారు. వాటిని సకాలంలో పూర్తి చేయడం మీకు కష్టం అవుతుంది. వ్యాపారం ఈ మధ్య కొంచెం నెమ్మదిగా ఉంది. ఈ సమయంలో వివాహ జీవితంలో ప్రేమ, ఒత్తిడి రెండూ కలసి ఉంటాయి. కనుక ఎవరితోనూ కలవకండి. మీ సమూహాన్ని వదిలిపెట్టే ప్రయత్నం చేయకండి. మీ భాగస్వామితో బాగా కలిసి ఉండటానికి ప్రయత్నించండి. ప్రేమికుల మధ్య శృంగారభరిత వాతావరణం నెలకొంటుంది.

.

సింహం (Leo) : సింహ రాశి వారు ఈ వారం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మంచి ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేయాలి. మీ కోపాన్ని నియంత్రించుకోండి. మీ మాటలతో ఎవరినీ హింసించకండి. ముఖ్యంగా మీ భాగస్వామితో గొడవ పడకండి. ఎందుకంటే ఇది మీ వివాహంలో వివాదాన్ని కలిగించవచ్చు. మీ సృజనాత్మక ఆలోచనల కారణంగా, అందరి మన్నలను పొందగలుగుతారు. మీకు బయట మంచి అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ అవకాశాన్ని వదులుకోకండి. కొన్ని ఖర్చులు ఉంటాయి.. కానీ ఆదాయం కూడా సంతృప్తికరంగా ఉంటుంది. మీరు కొత్త వ్యాపార ఒప్పందాలను చేసుకోకపోవడం మంచిది.

.

కన్య (Virgo) : కన్య రాశి వారు ఈ వారం ఉద్యోగంలో మంచిగా ఏకాగ్రత కలిగి ఉంటారు. అంతేకాకుండా, మీ ఆదాయం, ఖర్చులను సరిగ్గా ప్లాన్​ చేసుకుంటారు. ఇది మీ ఖర్చులను సరైన పరిధిలోకి తీసుకురావడానికి సహాయపడుతుంది. సరైన ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేయడం ఉత్తమం. ఉద్యోగంలో ఉన్నవారు ఈ వారం చాలా బాగా ఉంటారు. ఎందుకంటే మీ శ్రమ ఫలాలను చూడటానికి సమయం ఆసన్నమైంది. మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. వ్యాపారంలో ఉన్నవారు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు గొప్ప ఆశలను పెట్టుకున్న కొన్ని ఆలోచనలు కుప్పకూలవచ్చు. ఇంట్లో సమస్యలను ఎదుర్కొంటున్న వివాహితులు దేవుని ప్రార్ధించండి. ఒక ఆలయాన్ని సందర్శించడం ద్వారా మనశ్శాంతిని పొందవచ్చు. ప్రేమ జీవితం కాలక్రమేణా బాగుంటుంది.

.

తుల (Libra) : ఈ వారం తుల రాశి వారికి మంచిగా ఉంటుంది. వారంలో మొదటిలో మీరు ఒక దూర ప్రయాణం చేయవచ్చు. మీరు మీతో పనిచేసే వ్యక్తులతో మంచిగా వ్యవహరిస్తే, మీ కంపెనీలో మీ స్థానం బలంగా ఉంటుంది. మీరు, మీ సీనియర్లు మంచి అన్యోన్యంగా ఉంటారు. ఘర్షణలను నివారించడానికి ప్రయత్నించండి. ఖర్చులు తక్కువగా.. ఆదాయం ఎక్కువగా ఉంటుంది. సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. వివాహితులు దీర్ఘ ప్రయాణాలు చేయవచ్చు. ఈ వారం విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. మీరు కొన్ని ఆన్‌లైన్ కోర్సులు కూడా చేయడం మంచిది. వారంలో ప్రారంభంలో ప్రయాణం చేస్తే లాభదాయకంగా ఉంటుంది.

.

వృశ్చికం (Scorpio) : ఈ వారం వృశ్చిక రాశి వారు చాలా ఒడిదొడుకులను ఎదుర్కొంటారు. వారంలో మొదటిలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే అవి మీకు వ్యతిరేకంగా పనిచేయవచ్చు. వారం మొదట్లో ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంది. ఖర్చులు ఎక్కువగా ఉన్నందున, మీ ఆదాయం తక్కువగా కనిపిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఇప్పుడు బాగా కష్టపడి పనిచేయాలి. అప్పుడే మంచి పేరు వస్తుంది. అనవసరమైన వాదనలు పెట్టుకోకండి. వ్యాపారంలో ఉన్నవారు తరచూ వ్యాపార ప్రయోజనాల కోసం ప్రయాణిస్తారు. మీకు అనుకూలమైన ఒప్పందాలు కుదురుతాయి. వివాహితులు అద్భుతమైన గృహ జీవితాన్ని కలిగి ఉంటారు. మీ జీవిత భాగస్వామితో కలిసి విహార యాత్ర చేస్తారు. ప్రేమలో ఉన్నవారు ఈ వారం ఆనందకరంగా గడపవచ్చు.

.

ధనుస్సు (Sagittarius) : ఈ వారం ధనుస్సు రాశి వారికి సాధారణంగా ఉంటుంది. వారంలో మొదట్లో ఒక ముఖ్యమైన వ్యాపార విషయం బయటపడవచ్చు. ఒక మహిళ మీ వ్యాపారంలో ప్రత్యేకంగా మంచి పెట్టుబడి పెట్టవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయం కొంత బలహీనంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు మీ కార్యాలయంలో ఒకరితో వాదనకు దిగి.. బదిలీ కావడం లేదా మీ ఉద్యోగాన్ని కోల్పోవడం జరగవచ్చు. ఆరోగ్యం క్షీణించవచ్చు. మీరు ఆహార, పానీయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహితులు సంతోషకరంగా, శృంగారభరితంగా గడుపుతారు. వారం మొదటిలో, చివరి రోజుల్లో ప్రయాణం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా కృషి చేసిన తర్వాత విద్యార్థులు అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

.

మకరం (Capricorn) : ఈ వారం మకర రాశి వారు మధ్యస్థ ఫలితాలను పొందుతారు. మీరు ఎక్కువ ఖర్చులు చేస్తారు. కొంత స్వల్పమైన మానసిక ఒత్తిడి ఉంటుంది. వివాహంలో అసమతుల్యత కారణంగా కమ్యూనికేషన్ సమస్యలు ఉంటాయి. మీరు మీ భాగస్వామికి కొన్ని ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. నాణ్యమైన ఫోన్ కొనుగోలు చేయగలరు. మీ ప్రేమ జీవితానికి భవిష్యత్తు హామీ ఇస్తుంది. మీరు మీ భాగస్వామితో శృంగార క్షణాలను పంచుకునే అవకాశం ఉంటుంది. వ్యాపారులు అద్భుతమైన లాభాలను పొందుతారు. మీరు మీ కంపెనీలో కొన్ని కొత్త విషయాలు ప్రయత్నించినట్లయితే.. అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. యజమానులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. అలాగే మీ వ్యాపారాభివృద్ధి ఆలస్యం కావచ్చు. మీ పనిపై దృష్టి పెట్టడం ద్వారా మీరు విజయం సాధిస్తారు. వారంలో చివరి రోజున ప్రయాణించడం ఉత్తమం. విద్యార్థులకు సమయం కొంచెం మెరుగ్గా ఉంటుంది. వీరు చాలా శ్రద్ధాగా చదవాల్సి ఉంటుంది.

.

కుంభం (Aquarius) : ఈ వారం కుంభ రాశి వారికి మధ్యస్థ ఫలవంతంగా ఉంటుంది. వివాహితులు తమ భాగస్వామి చేసిన హానికారక వ్యాఖ్యల కారణంగా కొంత గృహ ఘర్షణను ఎదుర్కోవచ్చు. ప్రేమ సంబంధాలకు సమయం అనుకూలంగా ఉంది. అయినప్పటికీ, అన్ని ఘర్షణలను నివారించండి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకండి. ఉద్యోగంలో ఉన్నవారు నాణ్యమైన పని చేస్తారు. మీ కృషి ఫలిస్తుంది. మీకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి. వ్యాపారులు కూడా విజయం సాధిస్తారు. మీ పని ఫలితాలను చూసి మీరు చాలా సంతోషంగా కనిపిస్తారు. మీరు ప్రయాణించాలనుకుంటే వారంలో మొదటి కొన్ని రోజులు ఉత్తమం. విద్యార్థులకు కొన్ని అభ్యసన అవరోధాలు ఏర్పడవచ్చు.

.

మీనం (Pisces) : ఈ వారం మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వారం మొదట్లో మీ పనిలో పురోగతిని చూస్తారు. ఇది మీకు మరింత నమ్మకాన్ని ఇస్తుంది. మీ సంస్థను విస్తరించడానికి మీరు కొన్ని కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కొత్త నియమాలు తయారు చేస్తారు. అంతేకాకుండా, మీరు చాలా లాభాలు పొందుతారు. ఉద్యోగంలో ఉన్నవారు చాలా కృషి చేయాలి. మీకు దీని వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. మీరు మీ ఆహారంపై శ్రద్ధ వహించాలి. ఈ కాలంలో వివాహితులు సంతోషకరమైన గృహ జీవితాన్ని కలిగి ఉంటారు. వారి మధ్య బంధం బలంగా మారుతుంది. ప్రేమలో ఉన్నవారు తమ సంబంధంలో సంతోషంగా ఉంటారు. వారం మధ్యలో అద్భుతమైన ప్రయాణం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు మీ విద్యా విషయాల్లో మంచి విజయం సాధిస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.