Wedding procession snowfall: హిమాచల్‌ప్రదేశ్‌లో ఎటుచూసినా ధవళవర్ణమే దర్శనమిస్తోంది. కొండలు, కోనలు, చెట్లు, వీధులు అన్నీ మంచుతో నిండిపోయాయి. ఇలాంటి సమయంలో వివాహ తేదీని నిశ్చయించుకున్న ఓ జంట.. మంచు ఇక్కట్ల మధ్యే ఒక్కటైంది.
Wedding in Himachal pradesh snow
చంబా జిల్లాలోని బిద్రోహ్ నాలా ప్రాంతానికి చెందిన వినీత్ ఠాకూర్, దందోరీకి చెందిన నిశా కుమారికి పెద్దలు వివాహం నిశ్చయించారు. పంచాంగం ప్రకారం జనవరి 23 రాత్రి 10గంటలకు వివాహ ముహూర్తం ఖరారు చేశారు.
పెళ్లి వేడుక కోసం ఆదివారం వరుడు, అతడి కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి బయల్దేరారు. అయితే, ఆ రోజు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీగా మంచు కురవడం ప్రారంభమైంది. అయినా వెనక్కి తగ్గకుండా మంచులోనే ఊరేగింపుగా వరుడిని తీసుకెళ్లారు. ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న వధువు ఇంటి వరకు ఇలాగే మంచులో వెళ్లారు.
సురక్షితంగా ఇంటికి చేరుకున్న తర్వాత సంప్రదాయబద్ధంగా వివాహం జరిపించారు. వధూవరుల జాతకాల ప్రకారం ఆదివారమే మంచి మూహూర్తం కుదిరిందని, అది దాటితే వేరే తేదీ కోసం చాలా రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడేదని బంధువులు చెప్పారు. అందుకే ఎట్టిపరిస్థితుల్లో వివాహం అనుకున్న సమయానికే జరిగేలా చూశామని వివరించారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: నా భర్త నన్ను కొడతారు.. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు: యూపీ మంత్రి