ETV Bharat / bharat

Wedding bus accident: పెళ్లి బస్సు బోల్తా- 30 మందికి గాయాలు - పెళ్లి బస్సు ప్రమాదంలో 30 మందికి గాయాలు

Wedding Bus accident : పెళ్లి బస్సు బోల్తా పడిన ఘటనలో 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం ఒడిశాలోని గజపతి జిల్లాలో జరిగింది.

marriage bus accident
marriage bus accident
author img

By

Published : Dec 14, 2021, 10:15 AM IST

Wedding Bus accident: ఒడిశా గజపతి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. 35 మందితో వెళ్తున్న పెళ్లి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ జరిగింది

బాధితులంతా.. గంజామ్​ జిల్లాలోని బలిపాదర్​ గ్రామంలో వివాహానికి హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి తమ స్వగ్రామానికి బయలు దేరారు. ఈ క్రమంలోనే గజపతి జిల్లాలో రాయగడ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని సెబక్​పుర్​కు సమీపంలో బస్సు ప్రమాదానికి గురైంది.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను పర్లాకిముడిలోని ఆస్పత్రికి తరలించారు. అయితే బస్సు డ్రైవర్​ పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: బలవంతంగా శృంగారానికి ప్రయత్నం.. భర్త అంగం కోసిన భార్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.