ETV Bharat / bharat

Heavy Rains In Telangana : తడిసిముద్దవుతున్న హైదరాబాద్.. రాగల రెండు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు

IMD Weather Report On Rains Today : నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటి నుంచి వాతావరణం చాలా చల్లగా మారిపోయింది. దీనితో పాటు వాతావరణ శాఖ మరో ప్రకటన విడుదల చేసింది. రానున్న రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు హైదరాబాద్​లో వరుసగా రెండోరోజు పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Heavy Rains In Telangana
Heavy Rains In Telangana
author img

By

Published : Jun 25, 2023, 4:57 PM IST

Heavy Rains Over Next 2 Days In Telangana : వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఒడిశా-పశ్చిమ బెంగాల్​ తీరాలకు దగ్గరలో ఆవర్తన ప్రభావంతో.. ఇదే ప్రాంతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు రోజులపాటు తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటన విడుదల చేసింది.

ఈ అల్పపీడనం సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ.. ఎత్తుకు వెళ్లేకొలది నైరుతి దిశ వైపుగా వంపు తిరిగిందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కొమురం భీం, ఆసిఫాబాద్​, నిర్మల్​, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్​, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

హైదరాబాద్​లో భారీ వర్షాలు : నైరుతి రుతుపవనాల రాక.. అల్ప పీడన ప్రభావంతో హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్​లోని కూకట్​పల్లి, హైదర్​నగర్​, నిజాంపేట్​, ప్రగతి నగర్​, మూసాపేట్​, బాచుపల్లి, కేపీహెచ్​బీ కాలనీల్లో వర్షం పడింది. అలాగే కుత్బుల్లాపూర్​, జీడిమెట్ల, కొంపల్లి, సురారం, షాపూర్​ నగర్​, చింతల్​, జగద్గిరిగుట్ట, మల్కాజ్​గిరి ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. వర్షాలు పడడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. వర్షపు నీరు రోడ్లపై భారీగా నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

RAIN AT SECUNDERABAD : సికింద్రాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. సికింద్రాబాద్, చిలకలగూడ, ప్యారడైజ్, బేగంపేట, మారేడుపల్లి, అల్వాల్, తిరుమలగిరి, బోయిన్​పల్లి ప్రాంతాలలో వర్షం ముసిరింది. వర్షం ధాటికి కాలనీలలో,రహదారులపై నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో నగరవాసులు చల్లటి వాతావరణం ఆస్వాదిస్తున్నారు.

వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు : ఈ వర్షాలకు జీహెచ్​ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. రోడ్లపై నిలిచే వర్షపు నీరు నిలిచిపోకుండా చేస్తున్నారు. నగరవాసులు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీటితో పాటు మరికొన్ని జాగ్రత్తలు పాటించాలి.

  • మ్యాన్​హోల్స్​ వంటి వాటి దగ్గర జాగ్రత్తగా ఉండాలి.
  • నగరవాసులు అవసరమైతే తప్ప ఎలాంటి ప్రయాణాలు చేయరాదు.
  • చిన్న పిల్లలను బయటకు వెళ్లకుండా చూసుకోవాలి.
  • వర్షం పడేటప్పుడు కరెంటు స్తంభాలను తాకరాదు.
  • నానిపోయిన ఇళ్లల్లో ఉండకూడదు.
  • రైన్​ సెఫ్టీ కిట్​లను భద్రపరుచుకోవాలి.
  • నిత్యవసర సరకులను ఎక్కువ మొత్తంలో కొని.. నిల్వ చేసుకోవాలి.
  • రైన్​కోట్​, గొడుగు వంటి వర్షాలకు తడవకుండా ఉండే పరికరాలను వాడాలి.
  • నానిన గోడలను ముట్టుకోరాదు. ఎందుకంటే దాని నుంచి కరెంటు సరఫరా అయ్యే అవకాశం ఉంటుంది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.