భారీ హిమపాతం జమ్ముకశ్మీర్‌ను వణికిస్తోంది. వారం రోజులుగా కురుస్తున్న మంచు వర్షానికి ఇప్పటికే ఉష్ణోగ్రతలు గడ్డకట్టించే స్థాయికి పడిపోయాయి. తాజాగా కురుస్తున్న మంచుతో.. రహదారులపై వాహనాలు జారుతున్నాయి. ట్రాఫిక్‌కు తరచూ అంతరాయం వాటిల్లుతోంది. భారీ మంచు వర్షం కారణంగా విమానాల రాకపోకలపైనా ప్రభావం పడింది.
శ్రీనగర్, పుంఛ్ జిల్లాలోని మండి ప్రాంతంలో హిమపాతం ఎక్కువగా ఉంది. ఈ సీజన్‌లో ఇంత స్థాయిలో మంచు వర్షం కురవడం ఇదే తొలిసారని స్థానికులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు జీరో డిగ్రీలకు పడిపోవడంతో ఇప్పటికే ప్రఖ్యాత దాల్ సరస్సు గడ్డకట్టింది.
ఇదీ చదవండి:కేరళ తీరంలో తగ్గిన 'ఆలివ్ రిడ్లీ' తాబేలు గూళ్లు!