ETV Bharat / bharat

చైనాకు ఆర్మీ చీఫ్​ హెచ్చరిక- ఏకపక్షంగా వ్యవహరిస్తే.. - 14th round of Military Commander Level (SHMCL) talks

Army Chief warns China: సరిహద్దుల్లో ముష్కరులు తరచూ చొరబాట్లకు పాల్పడుతున్నారని అన్నారు ఆర్మీ చీఫ్​ జనరల్​ ఎం.ఎం. నరవణే. లద్దాఖ్​ వద్ద చైనా ఆర్మీని.. భారత సైన్యం సమర్థంగా ఎదుర్కొంటోందని తెలిపారు.

Army chief
Army chief
author img

By

Published : Jan 12, 2022, 7:35 PM IST

Army Chief warning to China: లద్దాఖ్‌ సరిహద్దుల్లో చైనా ఆర్మీని భారత సైన్యం సమర్థంగా ఎదుర్కొంటోందని అన్నారు సైనికాధ్యక్షుడు జనరల్​ ఎం.ఎం. నరవణే. ఆ ప్రాంతంలో అత్యున్నత స్థాయి కార్యాచరణ సంసిద్ధతను కొనసాగిస్తున్నామని తెలిపారు. జనవరి 15 'ఆర్మీ డే' కు ముందు.. మీడియాతో మాడ్లాడిన ఆర్మీ చీఫ్‌ చైనాతో చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్ముతున్నట్లు వివరించారు.

యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలపై మండిపడ్డ నరవణే.. డ్రాగన్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తే భారత బలగాల ప్రతిస్పందన చాలా బలంగా ఉంటుందని హెచ్చరించారు. చైనా విసిరే ఏ సవాలునైనా ఎదుర్కోవడానికి.. సర్వ సన్నద్ధంగా ఉన్నామన్నారు.

డిసెంబర్ 4 నాగాలాండ్ కాల్పుల ఘటనపై విచారణ నివేదిక త్వరలో వెలువడనుందన్న ఆర్మీ చీఫ్‌.. నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పశ్చిమ సరిహద్దులో ఉగ్ర కార్యకలాపాలు పెరుగుతున్నాయని, ముష్కరులు పదేపదే చొరబాట్లకు యత్నిస్తున్నారని వెల్లడించారు.

India, China 14th round of military talks

మరోవైపు.. సరిహద్దు సమస్యపై పరిష్కారం కోసం భారత్​-చైనా బుధవారం.. 14వ దఫా సైనిక స్థాయి చర్చలు నిర్వహించాయి. తూర్పు లద్దాఖ్​లోని మిగిలిన ఫ్రిక్షన్​ పాయింట్ల వద్ద.. 20 నెలలుగా నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే దిశగా ఇరు దేశాల సైనిక ఉన్నతాధికారులు చైనా వైపు ఉన్న ఛుషూల్​- మోల్డో ప్రాంతం వద్ద భేటీ అయ్యారు. ముఖ్యంగా హాట్​స్ప్రింగ్స్ ప్రాంతం వద్ద బలగాల ఉపసంహరణే లక్ష్యంగా ఈ చర్చలు జరిపినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

ఇవీ చూడండి: చైనాకు డ్రాగన్​ఫ్రూట్​ భయం!.. సూపర్​మార్కెట్లు బంద్

నిద్రలేస్తున్న పాత భూతం- ఈశాన్యంలో ఉగ్రవాదుల అలజడి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.