ETV Bharat / bharat

'ఆ అంశంలో సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం' - భారత 75వ స్వాతంత్ర్య వేడుకలు

నూతన పార్లమెంటు భవనం సెంట్రల్​ విస్టా ప్రాజెక్టు నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతించడంపై కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్​దీప్​ సింగ్​ పురీ హర్షం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు.

We welcome Supreme Court judgement giving go-ahead to Central Vista project: Puri
'ఆ అంశంలో సుప్రీం తీర్పు స్వాగతిస్తున్నాం'
author img

By

Published : Jan 5, 2021, 3:10 PM IST

నూతన పార్లమెంట్ భవనం- సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు అనుమతివ్వడాన్నికేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్​దీప్​ సింగ్​ పురీ స్వాగతించారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.

మెజారిటీ తీర్పు..

దిల్లీ ప్రపంచ స్థాయి రాజధానిగా అవతరించబోతోందని.. 2022లో జరిగే 75వ స్వాతంత్ర్య వేడుకల సమయానికి నూతన పార్లమెంటు భవనం అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.

  • Delhi is on course to becoming a World Class capital city and in the first step by the time nation completes 75 years of its Independence in 2022 a new Parliament building will be ready reflecting the aspirations of new India.

    — Hardeep Singh Puri (@HardeepSPuri) January 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సెంట్రల్​ విస్టా ప్రాజెక్టుపై గౌరవ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. పర్యావరణానికి హాని చేయకుండా.. ఉన్నత ప్రమాణాలతో నిర్మాణాన్ని చేపట్టడం పట్ల మా ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది.

-హర్​దీప్​ సింగ్​ పురీ

పది అంతస్తుల్లో ప్రధాని భవనం..

నూతన పార్లమెంటు భవనంలో ప్రధాని నివాసాన్ని పది అంతస్తుల్లో.. గరిష్ఠంగా 12 మీటర్ల ఎత్తుతో నిర్మించనున్నారు. కేంద్ర ప్రజా పనుల విభాగం ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని రూ.11,794కోట్ల నుంచి.. రూ.13,450కోట్లకు సవరించింది.

సెంట్రల్​ విస్టా ప్రాజెక్టు డిజైన్, స్థలం కేటాయింపు, పర్యావరణ అనుమతులను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ అంశంలో కేంద్రం వాదనలతో ఏకీభవించిన జస్టిస్ ఏఎం ‌ఖన్విల్కర్‌ నేతృత్వంలోని.. త్రిసభ్య ధర్మాసనం 2-1 తేడాతో తీర్పు వెలువరించింది. ఈ ప్రాజెక్టుకు కావలసిన అనుమతులన్నీ ఉన్నాయని.. ఈ స్థలాన్ని సెంట్రల్​ విస్టా ప్రాజెక్టు నిర్మాణానికి ఉపయోగించుకోవచ్చని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: సెంట్రల్​ విస్టా ప్రాజెక్ట్​కు సుప్రీంకోర్టు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.