ETV Bharat / bharat

'కరోనా‌ కట్టడికి మిలటరీ కావాలి' - ఝార్ఖండ్​ సీఎం

ఉద్ధృతంగా వ్యాపిస్తున్న కరోనాను అదుపు చేసేందుకు మిలటరీ బలగాలు కావాలని ఝార్ఖండ్​ సీఎం హేమంత్‌ సోరెన్‌ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాస్తామని పేర్కొన్నారు. ప్రాణాంతక స్థితిలో వైరస్‌ వ్యాప్తి చెందుతున్నా ప్రజల్లో భయం లేకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Jharkhand CM, Hemanth Soren
ఝార్ఖండ్​ సీఎం, హేమంత్‌ సోరెన్
author img

By

Published : Apr 19, 2021, 7:02 AM IST

దేశ వ్యాప్తంగా కొవిడ్‌ ఉద్ధృతంగా వ్యాపిస్తున్న వేళ ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాప్తి అధికంగా ఉందని, దీనిని అదుపు చేసేందుకు మిలటరీ బలగాలు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రాణాంతక స్థితిలో వైరస్‌ వ్యాప్తి చెందుతున్నా ప్రజల్లో భయం లేకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

"కొవిడ్‌ వ్యాప్తిపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లకు ప్రభుత్వం తరఫున లేఖలు రాస్తాం. వైరస్‌ విస్తృతిని అరికట్టేందుకు కేంద్ర బలగాలను ఝార్ఖండ్‌లో మోహరించాలని కోరతాం" అని సోరెన్‌ మీడియాకు వివరించారు.

"ఇటీవల ఓ ఉపఎన్నికల ప్రచారం కోసం వెళ్లాను. ప్రజలను చూసి షాక్‌కు గురయ్యాను. ఎవరూ మాస్క్‌లు ధరించడం లేదు. భౌతిక దూరాన్ని పాటించడం లేదు. వాళ్లకు కరోనా వైరస్‌ అంటేనే అసలు భయం లేదు. అందువల్ల వీరందరికీ ఓ గట్టి సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే కేంద్రానికి లేఖ రాయబోతున్నాను."

- హేమంత్​ సొరేన్‌, ఝార్ఖండ్​ సీఎం

ఇదీ చూడండి: ఆసక్తి రేకెత్తించిన కేంద్ర మంత్రి ట్వీట్‌!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.