ETV Bharat / bharat

'ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి కొవిన్​ యాప్'​

గత వందేళ్లలో కరోనా లాంటి మహమ్మారి మరొకటి రాలేదని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) పేర్కొనారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా మృతిచెందినవారికి మోదీ నివాళులు అర్పించారు.

PM Modi
ప్రధాని నరేంద్ర మోదీ
author img

By

Published : Jul 5, 2021, 3:34 PM IST

Updated : Jul 5, 2021, 4:09 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి(Covid Virus) కారణంగా మృతిచెందినవారికి ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) నివాళులు అర్పించారు. గత వందేళ్లలో ఇలాంటి మహమ్మారి మరొకటి రాలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు కొవిన్​ గ్లోబల్​ కన్​క్లేవ్​లో మోదీ ప్రసంగించారు.

ఒంటరిగా ఏ దేశం కూడా కరోనా ఎదుర్కోలేదని అనుభవాల్లో స్పష్టమైందన్నారు. మానవత్వాన్ని పెంపొందించేందుకు మనమంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కొవిడ్-19పై పోరాడేందుకు సాంకేతికత ఎంతో ముఖ్యమైనదన్నారు.

సాంకేతికతతో విజయం..

కొవిన్ యాప్​ను(Cowin app) ప్రపంచంలోని అన్ని దేశాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు భారత్​ కట్టుబడి ఉందని మోదీ అన్నారు. సాంకేతికతతో కరోనాపై విజయం సాధించవచ్చని ధీమా వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి విజృంభించినప్పటి నుంచి భారత్​.. తన అనుభవాలు, సవాళ్లు, వనరులను ప్రపంచంతో పంచుకుంటూ వచ్చిందని మోదీ అన్నారు. ఇక నుంచి మొత్తం టీకా ప్రక్రియను డిజిటల్ విధానంలోనే అనుసరిస్తామని తెలిపారు.

"కొవిడ్​పై విజయం సాధించేందుకు వ్యాక్సినేషన్​ ప్రక్రియ ఎంతో కీలకం. ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా భావించటం భారత నాగరికతలో అంతర్భాగమే. ఆ ప్రాథమిక సత్యాన్ని కరోనా మహమ్మారి మరోసారి గుర్తుచేసింది. అందుకే కొవిడ్​ వ్యాక్సినేషన్​ యాప్​ 'కొవిన్​'​ను ప్రపంచ దేశాలు వినియోగించేలా రూపొందించాం."

- ప్రధాని నరేంద్ర మోదీ

ప్రస్తుతం.. కెనడా, మెక్సికో, నైజీరియా సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 దేశాలు కొవిన్​ యాప్​ను తమదేశాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి.

ఇదీ చదవండి : 'ఆగస్టు నుంచే కరోనా మూడో దశ వ్యాప్తి'

Last Updated : Jul 5, 2021, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.