కరోనా మహమ్మారి(Corona virus) కారణంగా విధించిన ఆక్షలను(Corona restrictions) పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్(shivraj singh chauhan news). ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 78 క్రియాశీల కేసులు ఉన్నాయని, కొత్త కేసులు(Corona cases) సైతం తగ్గిపోయిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
"అన్ని సామాజిక, రాజకీయ, క్రీడలు, వినోదం, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు పూర్తి సామర్థ్యంతో నిర్వహించేందుకు అనుమతిస్తున్నాం. ప్రదర్శనలు, వివాహాలు, అంత్యక్రియలు ఎలాంటి ఆంక్షలు లేకుండా నిర్వహించుకోవచ్చు. బుధవారం నుంచి రాత్రి కర్ఫ్యూను ఎత్తివేస్తున్నాం. సినిమా హాళ్లు, మాల్స్, స్విమ్మింగ్ పూల్స్, జిమ్ములు, యోగా కేంద్రాలు, రెస్టారెంట్లు, క్లబ్బులు, పాఠశాలలు, కళాశాలలు, హోటళ్లు, కోచింగ్ సెంటర్లు పూర్తిస్థాయిలో 100శాతం సామర్థ్యంలో నడుస్తాయి. "
- శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి.
అయితే.. ప్రతి కార్యక్రమం, పని కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలని సూచించారు(mp lockdown guidelines today) సీఎం. మాస్కులు ధరించటం(mask guidelines), భౌతికదూరం పాటించటం తప్పనిసరి అని స్పష్టం చేశారు. దుకాణాలు, హోటళ్ల యజమానులు, 18 ఏళ్లుపైబడిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, సినిమా హాళ్ల సిబ్బంది పూర్తిస్థాయిలో టీకా తీసుకోవాలన్నారు.
ఇదీ చూడండి: వారు 'వర్క్ ఫ్రమ్ హోం' చేసేందుకు కేంద్రం నో- సుప్రీం అసహనం