బంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఆర్పీఎఫ్ బలగాల కాల్పుల్లో చనిపోయిన ఐదుగురి కుటుంబాల్ని పరామర్శించడానికి వెళుతున్న గవర్నర్ జగ్దీప్ ధన్‌ఖడ్‌కు నిరసన సెగ తగిలింది. ఆయన వెళుతున్న దారిపొడవునా నల్లజెండాలతో కొందరు నిరసనలు తెలిపారు. కాగా నిరసనకారుల్ని పోలీసులు చెదగరగొట్టి గవర్నర్ వెళ్లేలా చూశారు. మాథాభాంగా నుంచి సీతల్‌కూచి వెళుతుండగా ఈ పరిణామం జరిగింది.
బంగాల్లో ఎన్నికల ఫలితాల తర్వాత భాజపా సహా ఇతర పార్టీల కార్యకర్తలపై దాడులు జరగగా.. వారినీ పరామర్శించడానికి గవర్నర్ జగ్దీప్ ధన్‌ఖడ్ కూచ్‌బిహార్ జిల్లాకు వెళ్లారు. మాథాభాంగాలో ఓ బాధితురాలు ఆయన కాళ్లపైపడి "గూండాలు మమ్మల్ని కొట్టి.. ఇల్లంతా దోచుకెళ్లి పోయారు" అని వాపోయింది.
గవర్నర్ పర్యటనను సీఎం మమతా బెనర్జీ తప్పుబట్టారు.
ఇదీ చదవండి: బంగాల్ భాజపా ఎమ్మెల్యేలకు కేంద్ర భద్రత!