బంగాల్ శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కొవిడ్ ఉద్ధృతిపై కలకత్తా హైకోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలకు ఉపక్రమించింది. బుధవారం అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష భేటీకి ఈసీ పిలుపునిచ్చింది.
శుక్రవారం సమావేశం జరగనుండగా.. దీనికి అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు, నేతలు హాజరుకానున్నారు. వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని బంగాల్‌లోని ఎన్నికల ప్రచారంలో తీసుకోవాల్సిన కరోనా జాగ్రతలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు.
మిగిలిన దశల ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలకు కొవిడ్ నిబంధనలపై ఈసీ కఠిన మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: 'దేశానికి భాజపా ప్రాముఖ్యత ఇవ్వడం గొప్పవిషయం'