ETV Bharat / bharat

'ఆ పేలుడు పదార్థాలు కొన్నది సచిన్‌ వాజేనే' - 'ఆ పేలుడు పదార్థాలు కొన్నది సచిన్‌ వాజేనే'

రిలయన్స్​ ఇండస్ట్రీస్​ అధినేత ముకేశ్​ అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాల వాహనం కేసులో మరో ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. సంబంధిత జిలెటిన్​ స్టిక్స్​ను సచిన్​ వాజేనే కొనుగోలు చేసినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) విచారణలో తేలింది.

Waze procured explosives found in SUV near Ambani's house: NIA
ఆ పేలుడు పదార్థాలు కొన్నది సచిన్‌ వాజేనే
author img

By

Published : Mar 31, 2021, 6:21 PM IST

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాల వాహనం కేసులో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ వాహనంలో ఉన్న జిలెటెన్‌ స్టిక్స్‌ను పోలీసు అధికారి సచిన్‌ వాజేనే కొనుగోలు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) వర్గాలు బుధవారం వెల్లడించాయి. అయితే.. ఆ పేలుడు పదార్థాలను వాజే ఎక్కడి నుంచి కొనుగోలు చేశారన్నది మాత్రం చెప్పలేదు.

ఇదీ చదవండి: భారత​ కుబేరుల్లో అగ్రస్థానంలో అంబానీ!

ఫిబ్రవరి 25న దక్షిణ ముంబయిలో ముకేశ్‌ అంబానీ ఇంటికి సమీపంలో కనుగొన్న పేలుడు పదార్థాల వాహనం కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో అరెస్టై, సస్పెన్షన్‌కు గురైన వాజే.. ప్రస్తుతం ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్నారు. అయితే.. జిలటెన్‌ స్టిక్స్‌తో ఉన్న వాహనాన్ని అంబానీ ఇంటి వద్ద నిలిపిన సమయంలో వాజే కూడా అక్కడే ఉన్నట్లు తమ వద్ద సీసీటీవీ ఫుటేజ్‌ ఉందని ఎన్ఐఏ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా.. ఆ వాహనంలో పెట్టిన పేలుడు పదార్థాలను కొనుగోలు చేసింది కూడా వాజేనే అని తెలిపాయి. దర్యాప్తులో భాగంగా ముంబయి పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను కూడా సేకరించనున్నట్లు చెప్పాయి. తద్వారా వాజే కదలికలను తెలుసుకోనున్నారు.

ఇదీ చదవండి: హిరేన్‌ హత్య: పన్నాగ భేటీలో సచిన్‌ వాజే!

వాహనం నిలిపింది వాజే డ్రైవర్‌..

మరోవైపు.. అంబానీ నివాసం సమీపంలో ఆ వాహనాన్ని పార్క్‌ చేసింది వాజే వ్యక్తిగత డ్రైవరేనని ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. డ్రైవర్‌ స్కార్పియోను తీసుకురాగా.. ఆ వెనుకే వాజే తెల్లరంగు ఇన్నోవా కారులో అనుసరించారని ఎన్‌ఐఏ అధికారులు చెప్పారు.

"ఫిబ్రవరి 17న మాన్‌సుఖ్‌ హిరేన్‌ స్కార్పియోను ములంద్‌ ఎరోలీ రోడ్డులో నిలిపాడు. అదే రోజు పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు వచ్చి కారు తాళాలను సచిన్‌ వాజేకు ఇచ్చి ఉంటారు. ఆ తర్వాత వాజే వ్యక్తిగత డ్రైవర్‌.. ఆ స్కార్పియోను తీసుకొచ్చి సాకేత్‌ హౌసింగ్‌ సొసైటీలోని వాజే నివాసంలో పార్క్‌ చేశాడు. అదే 19న మళ్లీ డ్రైవర్‌ కారును పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో తీసుకెళ్లాడు. అదే రోజు తిరిగి వాజే నివాసానికి తీసుకొచ్చాడు. అప్పటి నుంచి ఫిబ్రవరి 24 రాత్రి వరకు స్కార్పియో.. పోలీసు అధికారి ఇంటి వద్దే ఉంది. ఆ తర్వాత.. మరుసటి రోజు రాత్రి 10 గంటలకు డ్రైవర్‌ స్కార్పియోను తీసుకెళ్లి అంబానీ ఇంటి సమీపంలో పార్క్‌ చేశాడు. తర్వాత కారు దిగి వెనకాలే వాజే నడుపుతున్న ఇన్నోవాలో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు."

- ఎన్​ఐఏ

ఇదీ చదవండి: అంబానీ ఇంటి వద్ద స్కార్పియోకు.. తీహార్​​కు సంబంధమేంటి?

సాక్ష్యాలను మాయం చేసేందుకు..

కొద్ది గంటల తర్వాత వాజే మళ్లీ ఇన్నోవా కారులో వచ్చి స్కార్పియోలో బెదిరింపు లేఖ పెట్టి వెళ్లినట్లు ఎన్​ఐఏ అధికారులు పేర్కొన్నారు. సాక్ష్యాలను మాయం చేసేందుకు నిందితులు కొన్ని సీసీటీవీ రికార్డులను ధ్వంసం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.