యమునా నదిలో అమోనియా (water pollution in yamuna) ప్రమాదక స్థాయికి చేరుకుంది. దీంతో దిల్లీలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా స్తంభించింది. వాజిరాబాద్ ప్రాంతంలోని యుమునా నదిలో అమోనియా స్థాయి 3పీపీఎమ్ (పార్ట్స్ పర్ మిలియన్) ఉన్నట్లు అధికారులు తెలిపారు. తాగు నీటిని శుద్ధి చేసే ప్లాంట్లపై ఈ ప్రభావం పడినట్లు వెల్లడించారు.
హరియాణా నుంచి వెలువడిన పారిశ్రామిక వ్యర్థాలు యమునా నది నీటిలో ప్రవహిస్తున్నందున నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని దిల్లీ నీటి సరఫరా బోర్డ్ వైస్ ఛైర్మన్ రాఘవ్ చద్ధా తెలిపారు. దేశ రాజధానిలో తూర్పు, ఈశాన్య, దక్షిణ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని వెల్లడించారు.
"నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరుతున్నాను. తగిన సంఖ్యలో నీటి ట్యాంకర్లను కూడా అందుబాటులో ఉంచాము. యమునా నది నీటిలో అమోనియా స్థాయి పెరగడం వల్ల నీటి సరఫరా ప్రభావం పడింది"
-రాఘవ్ చద్ధా, దిల్లీ వాటర్ బోర్డ్ వైస్ ఛైర్మన్
పెరిగిన నీటి కాలుష్యాన్ని నియంత్రించడానికి (cause of water pollution in yamuna) ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. హరియాణా అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు.
![water pollution in yamuna](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13566853_img2.jpg)
దసరా, దీపావళి సందర్భంగా దిల్లీకి నీటి సరఫరాను అందించే గంగా కాలువను మూసివేశారు. దీంతో యమునా నదిపైనే ఎక్కువ ఆధారపడాల్సి వస్తోంది.
ఇదీ చదవండి:చెన్నైలో వరుణుడి బీభత్సం- 2015 తర్వాత ఇదే రికార్డు..