బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. బైకును ఢీ కొట్టిన కారు ఆగకుండా వెళ్లిపోయింది. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.
తుమకూర్ మెయిన్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. మృతులు నగరంలోని రాజాజీనగర్‌కు చెందిన శ్రీకాంత్, గౌతమ్‌గా గుర్తించారు. ఇరువురు ఓ ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలో పని చేస్తూ ఒకే దగ్గర నివాసం ఉంటున్నారు. సోమవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో జలహల్లీ నుంచి తుమకూర్ మెయిన్ రోడ్‌కు ద్విచక్రవాహనంపై వెళ్లారు యువకులు. తుమకూర్ రోడ్డుపైకి రాగానే ఓ కారు వారిని ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
![A horrible video of hit and run in Bengaluru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-bng-02-road-accident-7202806_24022021091200_2402f_1614138120_302_2402newsroom_1614143875_488.jpg)
ఈ ఘటనపై యశ్వంతపుర్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరాలో నమోదైన కారు నంబర్ ఆధారంగా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చూడండి: ఒకే కుటుంబంలో ఐదుగురి హత్య