ETV Bharat / bharat

'తూర్పు లద్దాఖ్​ నుంచి చైనా పూర్తిగా వైదొలగాల్సిందే!'

Wang Yi India Visit: జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌తో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్‌ యీ దిల్లీలో భేటీ అయ్యారు. తూర్పు లద్దాఖ్‌ వివాదం సహా ఉక్రెయిన్‌ సంక్షోభంపై చర్చించారు. వాస్తవాదీన రేఖ ప్రాంతాల్లో ఉన్న సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియను అన్ని ప్రాంతాల్లో కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం.

wang yi india visit
వాంగ్ యీ
author img

By

Published : Mar 25, 2022, 2:18 PM IST

Wang Yi India Visit: వాస్తవాదీన రేఖ ప్రాంతాల్లో ఉన్న సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియను అన్ని ప్రాంతాల్లో కొనసాగించాలని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీను కోరారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌. దౌత్య, సైనిక స్థాయిలో సానుకూల చర్చల ప్రక్రియ కొనసాగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అందుకు ఉన్న అడ్డంకులను తొలగించాలని పేర్కొన్నారు. ఇరు దేశాలు చేపట్టే చర్యలు సమాన, పరస్పర భద్రతా స్ఫూర్తిని ఉల్లంఘించకుండా చూసుకోవాలని దిల్లీలో జరిగిన భేటీలో ఏకాభిప్రాయానికి వచ్చారు.

తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు వివాదంతో సంబంధాలు క్షీణించిన వేళ భారత్‌, చైనా మధ్య రెండేళ్ల తర్వాత ఈ కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. భారత పర్యటనకు వచ్చిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌తో శుక్రవారం సమావేశమయ్యారు. తూర్పు లద్దాఖ్‌ వివాదం సహా ఉక్రెయిన్‌ సంక్షోభంపై చర్చించారు. ప్రత్యేక ప్రతినిధి స్థాయిలో చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు చైనాలో పర్యటించాలని అజిత్ డోభాల్​ను ఆహ్వానించారు వాంగ్​ యీ.

wang yi india visit
డోభాల్​- వాంగ్ యీ భేటీ

డోభాల్​తో సమావేశం అనంతరం జయ్‌శంకర్‌తో చైనా విదేశాంగ మంత్రి సమావేశం అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీతో వాంగ్‌ యీ సమావేశంపై స్పష్టత లేదు. లద్దాఖ్​లో సరిహద్దు ప్రతిష్టంభనపై భారత్- చైనా మధ్య అత్యున్నత స్థాయి చర్చలు జరుగుతున్నాయి. కొన్ని వివాదాస్పద ప్రాంతాల్లో ఇప్పటికే ఇరుపక్షాలు సైనికులను ఉపసంహరించుకున్నాయి. ఇంకా వివాదం కొనసాగుతున్న మరికొన్ని ప్రాంతాల్లో సమస్యను పరిష్కరించడానికి మార్చి 11న ఇరుదేశాల మధ్య మిలిటరీ స్థాయిలో చర్చలు జరిగాయి. కానీ ఆ చర్చలు విఫలమయ్యాయి.

wang yi india visit
భారత్- చైనా మధ్య ప్రతినిధుల స్ధాయి చర్చలు

ఇదీ చదవండి: భారత్‌లో చైనా విదేశాంగ మంత్రి.. జైశంకర్, డోభాల్​తో నేడు భేటీ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.