గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు. ఈ సందర్భంగా అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయం వంటి ఆదర్శాలను ఆధారంగా తీసుకొని రాజ్యాంగ, గణతంత్ర వ్యవస్థాపక సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని ఉద్ఘాటించారు. అలాగే స్వావలంబన భారత్ కోసం ప్రజలు అంకితం కావాలని పిలుపునిచ్చారు.
"మన ప్రజాస్వామ్యం శక్తిమంతమైంది. సుపరిపాలనకు కట్టుబడి ఉంది. దేశంలో పారదర్శకత గతంలో కంటే మెరుగ్గా ఉంది. నాగరికత ఆదర్శాలు, రాజ్యాంగ విలువలతో కూడిన శాంతియుత, శ్రావ్యమైన, ప్రగతిశీల భారత్‌ను నిర్మించడానికి మనల్ని మనం అంకితం చేసుకునేందుకు ప్రతిజ్ఞ చేసుకోవాలి."
- ఎం వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి
ఇదీ చూడండి: రిపబ్లిక్ డే- దేశ రాజధానిలో పటిష్ఠ భద్రత