కాంగ్రెస్, వామపక్షాలకు ఓటేస్తే నోటాకు వేయటంతో సమానమని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ(Abhishek Banerjee) పేర్కొన్నారు. ఆ పార్టీలకు ఓటేస్తే భాజపా విజయావకాశాలను పెంచినట్లు అవుతుందన్నారు. రెండు శాసనసభ స్థానాల్లో ఉపఎన్నిక(West Bengal By Election) జరగటానికి కారణమైన భాజపాకు ఓటు అడిగే నైతికహక్కు లేదని ధ్వజమెత్తారు.
పలు కారణాలతో ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలు మరణించడం వల్ల వాటికి ఉపఎన్నిక అనివార్యమైందని అభిషేక్(Abhishek Banerjee) తెలిపారు. యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్న బంగాల్ ఉప ఎన్నికల్లో టీఎంసీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశప్రజలు మమతాబెనర్జీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు.
బంగాల్లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు అక్టోబరు 30న ఉపఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చూడండి: 'కశ్మీర్ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరు'
ఇదీ చూడండి: 'టీకా విజయంతో ప్రపంచం చూపు భారత్ వైపు'