ETV Bharat / bharat

వర్టికల్​ రేంజ్​ క్షిపణి ప్రయోగం విజయవంతం

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అధునాతన వీఎల్​-ఎస్​ఆర్​ఎస్​ఏఎం ​క్షిపణిని శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. ఉపరితలం నుంచి ప్రయోగించిన ఈ మిస్సైల్​ నిర్దేశిత లక్ష్యాలను ఛేదించినట్లు అధికారులు వెల్లడించారు.

VL-SRSAM successfully launched twice
రెండుసార్లు విజయవంతంగా క్షిపణి పరీక్ష
author img

By

Published : Feb 22, 2021, 10:58 PM IST

భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ) మరో క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని ఛాంద్​పూర్​ ఇంటిగ్రేటెడ్​ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) కేంద్రంలో వర్టికల్​ లాంచ్​ షార్ట్ రేంజ్​ సర్​ఫేస్​ టూ ఎయిర్​ మిసైల్(వీఎల్​-ఎస్​ఆర్​ఎస్​ఏఎం)ను ఉపరితలం నుంచి గగనతంలోకి రెండుసార్లు విజయవంతంగా ప్రయోగించింది.

ఈ క్షిపణి సకాలంలో కచ్చితమైన లక్ష్యాలను ఛేదించినట్లు అధికారులు తెలిపారు. కొత్తగా పరీక్షించిన ఈ క్షిపణి... శత్రుదేశాల దాడులను నిలువరించగలదని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇదీ చూడండి: 'డీఆర్‌డీఓలో ఉద్యోగుల కొరత.. చర్యలు అవసరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.