క్రిస్మస్ వేడుకలు పలు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. చర్చిలన్నీ రంగురంగుల విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. వేకువజాము నుంచే చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. పాస్టర్లు, బిషప్‌లు ఏసు బోధనలను, ప్రత్యేక సందేశాలను ఇస్తున్నారు.



తమిళనాడు చెన్నైలోని సీఎస్ఐ వెస్లీ చర్చిలో అర్ధరాత్రి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.


గోవా పనాజీలోని చర్చిలో క్రిస్మస్ సందర్భంగా.. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ సామూహిక ప్రార్థనలు చేశారు.


బంగాల్ కోల్‌కతాలోని పార్క్ స్ట్రీట్‌లో ప్రజలు భారీగా గుమికూడారు.



దిల్లీలోని సేక్ర్డ్ హార్ట్ కేథడ్రల్ చర్చిని సుందరంగా అలంకరించారు. అక్కడ పెద్ద క్రిస్మస్ స్టార్‌ను ఏర్పాటు చేశారు.



