ETV Bharat / bharat

ఇంజినీరింగ్​లో ఇక 'ఓపెన్​ బుక్ ఎగ్జామ్స్​'.. ఈ ఏడాది నుంచే... - ఇంజినీరింగ్​లో ఓపెన్​ బుక్​

ఇంజినీరింగ్​లో ఓపెన్​ బుక్​ పరీక్షల(open book examination) విధానాన్ని తీసుకురావడంపై కొన్ని సంవత్సరాలుగా చర్చలు జరుగుతున్నాయి. కానీ, అది అమలులోకి రాలేదు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. అయితే.. కర్ణాటకలోని విశ్వేశ్వరయ్య సాంకేతిక విశ్వవిద్యాలయం ఈ విద్యా సంవత్సరంలోనే కొన్ని కోర్సులకు ఈ విధానాన్ని(open book exam) అమలు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది.

Open Book Examination
ఇంజినీరింగ్​లో 'ఓపెన్​ బుక్​' విధానం​
author img

By

Published : Oct 6, 2021, 5:58 PM IST

ఓపెన్​ బుక్​ పరీక్షల విధానంపై(open book examination) చాలా సంవత్సరాలుగా చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని యూనివర్సిటీలు ప్రయోగాత్మకంగా చేపట్టాయి. ఈ క్రమంలోనే కర్ణాటక, బెళగావిలోని విశ్వేశ్వరయ్య సాంకేతిక విశ్వవిద్యాలయం(వీటీయూ).. ఈ విద్యా సంవత్సరంలోనే ఇంజినీరింగ్​లోని పలు కోర్సుల్లో(open book exam) అమలు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. డిజైన్​ ఆధారిత థీమ్​కు సంబంధించిన కోర్సుల్లో ముందుగా అమలు చేసి.. ఆ తర్వాత సివిల్​, మెకానికల్​, ఎలక్ట్రికల్​, ఆర్కిటెక్చర్​ వంటి కోర్సుల్లో ప్రవేశపెట్టాలని చూస్తోంది. నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు వీటీయూలోని ప్రత్యేక బోర్డు అధికారికంగా ఆదేశాలు జారీ చేయనుంది.

ఓపెన్​ బుక్​ విధానంపై(open book examin india) ఈటీవీ భారత్​ ముఖాముఖిలో పలు విషయాలు వెల్లడించారు.. ఎకనామిక్స్​, రిజిస్ట్రార్-ఎగ్జామినేషన్​, మూల్యాంకనం విభాగాధిపతి డాక్టర్​ సునీల్​ కుమార్​.

open book examinations
ప్రొఫెసర్​ డాక్టర్​ సునీల్​ కుమార్​
  • ప్ర: ఓపెన్​ బుక్​ పరీక్ష విధానం అంటే ఎమిటి?

జవాబు: ఓపెన్​ బుక్​ పరీక్ష విధానంలో(open book exam 2021) విద్యార్థులు క్లాస్​ నోట్స్​, అధ్యాపకులు ఇచ్చిన మెటీరియల్​, టెక్ట్స్​ బుక్స్​, ఇన్​స్టిట్యూషన్స్​ ఇచ్చిన అధికారిక మెటీరియల్స్​ను పరీక్షల్లో చూసే అవకాశం ఉంటుంది. పరీక్ష సమయంలో విద్యార్థులకు ప్రశ్నాపత్రంతో పాటు మెటీరియల్​ అందిస్తారు. ఇది ఇంట్లో పరీక్ష రాసినట్లుగా ఉంటుంది.

  • ప్ర: మన విద్యా వ్యవస్థకు ఈ విధానం ఎంత వరకు సరిపోతుంది​?

జవాబు: ఓపెన్​ బుక్​ పరీక్ష విధానానికి(open book exam means) విద్యాబోధన ప్రస్తుత సంప్రదాయ పద్ధతిలో కాకుండా వేరుగా ఉండాలి. జవాబు పత్రాల మూల్యాంకనంలోనూ విభిన్నంగా, నిర్దిష్ట ప్రమాణాలు ఉండాలి. చాలా విద్యా సంస్థల్లో కేస్​ స్టడీస్​, వీడియోలు, కోర్సు మెటీరియల్​తో తరగతి గదిలో బోధించడానికి అధ్యాపకులు వివిధ పద్ధతలను అవలంబిస్తారు. ఓపెన్​ బుక్​ విధానాన్ని అమలు చేయడానికి విభిన్న నైపుణ్యాలు కలిగి ఉండాలి.

  • ప్ర: ఈ విధానం అమలు చేస్తే.. ఏ కోర్సు దానికి అనుగుణంగా ఉంటుంది?

జవాబు: ఏ కోర్సులోనైనా ఓపెన్​ బుక్​ పరీక్షల విధానాన్ని అమలు చేయవచ్చు. అయితే.. పరీక్షలకు విభిన్నమైన ప్రశ్నాపత్రం అవసరం. విద్యార్థుల్లో విశ్లేషణ నైపుణ్యం ఉండాలి. అలాంటి పరీక్ష కోసం విద్యార్థులు సన్నద్ధం కావాలి.

  • ప్ర: ఓబీఈ విధానం లాభాలు, నష్టాలు ఏమిటి?

జవాబు: ఓపెన్​ బుక్​ విధానం విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది. ముందుగా బట్టీ పట్టే విధానానికి స్వస్తి పలకవచ్చు. అయితే.. ఇది కొన్ని క్లిష్టమైన నైపుణ్యాలను పరీక్షించేందుకు ఉపయోగపడకపోవచ్చు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో చాలా ఇన్​స్టిట్యూషన్స్​ ఓపెన్​ బుక్​ విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. భారత్​లో దిల్లీ యూనివర్సిటీ, సావిత్రిబాయ్​ పూలే వర్సిటీ, కళింగ విశ్వవిద్యాలయం, చండీగఢ్​ యూనివర్సిటీలోనూ ఓపెన్​ బుక్​ విధానం ఉంది.

మన ఇంజినీరింగ్​లోని అన్ని కోర్సులకు దీనిని అమలు చేయవచ్చు. విద్యార్థులు ప్రయోగాలు చేయాలి, సృజనాత్మకంగా ఆలోచించాలి, వివిధ సమస్యలు, వాటి పరిష్కారాలను అర్థం చేసుకోవాలి. అందుకే ఇలాంటి విధానం అవసరం.

ఇదీ చూడండి: 'ఓపెన్‌ బుక్‌' విధానంతో బట్టీ పద్ధతికి వీడ్కోలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.