ETV Bharat / bharat

Visakha Steel : విశాఖ ఉక్కు పరిశ్రమకు ముగిసిన బిడ్.. తెలుగు రాష్ట్రాలు దూరం..

author img

By

Published : Apr 20, 2023, 7:10 PM IST

Visakha Steel Expression of Interest : విశాఖ ఉక్కు పరిశ్రమ ఎక్స్​ప్రెషన్​ ఆఫ్​ ఇంట్రెస్ట్​ (ఈవోఐ) బిడ్ గడువు ముగిసింది. మొత్తం 29 సంస్థల తరఫున బిడ్లు రాగా ఇందులో విదేశీ సంస్థలకు చెందినవి ఏడు ఉన్నాయి. కాగా, రాష్ట్ర ప్రజలు, అఖిల పక్షం ఊహించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం బిడ్​లో పాల్గొనలేదు. మరోవైపు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మే 3న రాష్ట్ర వ్యాప్త రాస్తారోకో లకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక పిలుపునిచ్చింది.

Etv Bharat
Etv Bharat

Visakha Steel Expression of Interest : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో వర్కింగ్ కేపిటల్, ముడి సరుకు భాగస్వామ్యం కోసం... ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ) బిడ్ల దాఖలు గడువు ముగిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గానీ, అటు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సంస్థ సింగరేణి నుంచి గానీ ఎలాంటి బిడ్లు దాఖలు కాలేదు. మొత్తం 29 సంస్థలు ఈవోఐ దాఖలు చేసినట్టు సమాచారం. ఎన్ఎండీసీ లాంటి సంస్థలు ఏవీ ఈవోఐ దాఖలు చేయలేదని కార్మిక సంఘ నేతలు తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ వర్కింగ్ కేపిటల్, ముడి సరకు సరఫరా కోసం స్టీల్ వ్యాపారంలో గానీ.. స్టీల్ తయారీకి వినియోగించే ముడి సరకు వ్యాపారంలో ఉన్న వారి నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ మార్చి 27న విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఓ ప్రకటన విడుదలైంది. ఈ నెల 15 వ తేదీ వరకు గడువు ఇచ్చింది. దీన్ని మరో ఐదు రోజులు పొడిగిచారు. బిడ్లను నేరుగా గానీ... మెయిల్ ద్వారా గానీ పంపేందుకు అవకాశం కల్పించారు. గడువు ముగిసేలోపు... దాదాపు ఏడు విదేశీ సంస్థలు కూడా బిడ్లు దాఖలు చేసినట్లు కార్మిక నేత ఆయోధ్యరామ్ వెల్లడించారు.

విదేశీ సంస్థలు సైతం.. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈవోఐ కోసం దరఖాస్తు గడువు ఈ మధ్యాహ్నంతో ముగిసింది. కాగా, అందరూ ఊహించినట్లుగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గానీ, అటు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సంస్థ సింగరేణి నుంచి గానీ ఈవోఐ దాఖలు కాలేదు. మొత్తం 29 సంస్థలు ఈవోఐ(ఎక్స్ప్రెషన్ ఆఫ్‌ ఇంటరెస్ట్) దాఖలు చేసినట్టు సమాచారం. ఎన్ఎండీసీ లాంటి సంస్థలు ఏవీ ఈవోఐ దాఖలు చేయలేదని కార్మిక సంఘ నేతలు వెల్లడించారు. ఇందులో దాదాపు ఏడు విదేశీ సంస్థలు బిడ్లు దాఖలు చేశాయని కార్మిక నేత ఆయోధ్యరామ్ వివరించారు. విదేశీ సంస్థలు మన స్టీల్ ని కొనుగోలు చేసుకుని వెళ్తారని, మన బ్రాండ్ ఇమేజ్ కి దెబ్బలేకుండా మనకు కావాల్సిన నిధులు సమకూర్చి.. ఆ మేరకు స్టీల్ వారికి సరఫరా చేసే ఒప్పందం వల్ల విశాఖ ఉక్కుకు ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు. స్టీల్ వ్యాపారంలో ఉన్న జేఎస్​డబ్ల్యూ, జేఎస్పీఎల్ వంటివి విశాఖ స్టీల్ కి ప్రధాన పోటీ దారులని, వాటిలో ఎటువంటి ఒప్పంద మైనా విశాఖ స్టీల్ బ్రాండ్ ఇమేజ్ కే నష్టమని అయోధ్యరామ్ అభిప్రాపడ్డారు.

ఐక్య పోరాటాలకు సిద్ధం.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు... అనే నినాదంతో పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాటానికి సిద్ధం కావాలని అఖిల పక్ష నేతలు పిలుపునిచ్చారు. బుధవారం విజయవాడలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసని రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మే 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు చేపడుతున్నట్లు నేతలు చెప్పారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా మే 3వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.