ETV Bharat / bharat

కత్తులతో దోపిడీ ముఠా హల్​చల్​- ఛేజ్​ చేసి పట్టుకున్న ఎస్పీ - దోపిడీముఠాను రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్న వెల్లూరు ఎస్పీ

కత్తులతో బెదిరించి దోపిడీకి పాల్పడిన ముగ్గురు యువకులను జిల్లా ఎస్పీ రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఈ ఘటన తమిళనాడులోని వెల్లూరులో జరిగింది.

దోపిడీదారులను రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్న
నిందితున్ని రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్న ఎస్పీ సెల్వ కుమార్​
author img

By

Published : Nov 25, 2021, 3:53 PM IST

Updated : Nov 25, 2021, 5:20 PM IST

దోపిడీముఠాను రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్న వెల్లూరు ఎస్పీ

తమిళనాడు వెల్లూరు జిల్లా ఎస్పీ సమయస్ఫూర్తి ప్రదర్శించారు. కత్తులతో బెదిరించి దోపిడీకి పాల్పడుతున్న ముగ్గురు యువకులను రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

టాటూలు వేస్తూ జీవనం సాగిస్తున్న సతీష్(21) రోజూమాదిరిగానే వెల్లూరులోని గ్రీన్​ సర్కిల్​ ప్రాంతంలో పనిచేసుకుంటున్నాడు. ఆ సమయంలో సెల్వన్ పట్టి ప్రాంతానికి చెందిన కిషోర్,​ మరో ఇద్దరు యువకులు సతీష్​ను కత్తులతో బెదిరించారు. బాధితుని వద్ద నుంచి బలవంతంగా రూ.1200 వసూలు చేశారు. అదే సమయంలో స్థానిక ఎస్పీ సెల్వ కుమార్​ కారులో ప్రయాణిస్తూ ఈ ఘటనను చూశారు. వెంటనే కారు ఆపి దోపిడీకి పాల్పడినవారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. నిందితులు పారిపోవడానికి ప్రయత్నించగా.. పోలీసులు వెంబడించి వారిని పట్టుకున్నారు. దీంతో ఎస్పీ సెల్వ కుమార్​పై స్థానికులు ప్రశంసలు కురిపించారు.

పోలీసులు నిందితుల నుంచి రూ.1200, కత్తులను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:కటింగ్ చేయలేదని బార్బర్​ను కాల్చి చంపాడు

Last Updated : Nov 25, 2021, 5:20 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.