Video Viral Woman Innovation Toothpaste Used as Tap Control : సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయాక.. వింతలూ విశేషాలు నిమిషాల్లో వైరల్ అవుతున్నాయి. ఓ వైపు కొందరు వాంటెడ్‌గా తమ టాలెంట్ చూపిస్తుండగా.. మరికొందరు తమకు తెలియకుండానే వైరల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఇలా.. ఓవర్ నైట్‌లో ఫేమస్ అయిన వారు.. సెలబ్రిటీలుగా మారిపోయిన వారు ఎందరో ఉన్నారు. అయితే.. ఓ మహిళ తన ఇంటి పనిలో భాగంగా చేసిన వినూత్న ఆలోచన.. నెటిజన్లకు విపరీతంగా ఆకర్షించింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Woman Solve Her Problem With Toothpaste: కొత్తగా ఆలోచించాలే కానీ.. దేనికీ పనికిరావని పక్కన పడేసిన వస్తువులు కూడా.. ఆశ్చర్యపరుస్తూ అంతకంటే ఎక్కువగా పనికొస్తుంటాయి. కొందరు పాడయిన వస్తువులతోనే ఎవరూ ఊహించని విధంగా అద్భుతాలు సృష్టిస్తుంటారు. ఇక్కడ ఈ మహిళ చేసిన పని కూడా అలాంటిదే. ఆమె ఏకంగా అయిపోయిన పేస్ట్ ట్యూబ్‌ను ఉపయోగించి.. తన సమస్యను పరిష్కరించుకుంది. ఈ వీడియో గతంలోనే వైరల్ అయ్యింది. అది చూసిన వారంతా.. ‘‘టూత్ పేస్ట్ డబ్బాను ఇలా కూడా వాడొచ్చా’’..! అంటూ కామెంట్లు చేశారు. మీ క్రియేటివిటీ సూపర్ అంటూ మెచ్చుకున్నారు. అయితే.. ఆ వీడియోను.. భారత దిగ్గజ పారిశ్రామికవేత్త, RPG ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ హర్ష గోయెంకా.. తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో.. ఆ వీడియో మరోసారి వైరల్ అవుతోంది.
Butter Festival : వినూత్నంగా 'వెన్న హోళీ'.. 11వేల అడుగుల ఎత్తులో ఘనంగా వేడుకలు
-
Taps in India like….. #jugaad pic.twitter.com/7SKubgeXuD
— Harsh Goenka (@hvgoenka) September 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Taps in India like….. #jugaad pic.twitter.com/7SKubgeXuD
— Harsh Goenka (@hvgoenka) September 4, 2023Taps in India like….. #jugaad pic.twitter.com/7SKubgeXuD
— Harsh Goenka (@hvgoenka) September 4, 2023
పేస్ట్ అయిపోగానే సాధారణంగా ఎవరైనా డబ్బాను డస్ట్ బిన్లో పడేస్తారు. అలాంటి డబ్బా దేనికి పనికొస్తుందని అంతా అనుకుంటారు. కానీ ఈ మహిళ మాత్రం అలా కాదు. ఖాళీ పేస్ట్ ట్యూబ్ కూడా ఎంతో పనికొస్తుందని నిరూపించింది. పెద్ద సమస్యకు సొల్యూషన్‌గా ఉపయోగించడం మరింత ఆశ్చర్యకరం. ఆమె ఇంట్లోని వాటర్ ట్యాప్ ముందు భాగం విరిగిపోయింది. దీంతో.. ఆ నీటిని ఆపడం ఇబ్బందిగా మారింది. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తున్న ఈ క్రమంలోనే.. ఆమెకు అద్భుతమైన ఐడియా తట్టింది.
రోజు వాడే టూత్ పేస్ట్ ప్యాకెట్‌ను తన సమస్యకు సొల్యూషన్‌గా వాడింది. టూత్ పేస్ట్ అయిపోయాక దానిని పడేయకుండా క్లీన్ చేసింది. టూత్ పేస్ట్ ప్యాకెట్ వెనుక భాగాన్ని కత్తిరించి.. దానిని నల్లా పైపునకు తొడిగింది. ముందు భాగంలో టూత్ పేస్ట్ క్యాప్ పెట్టేసింది. ఇంకేముంది..? ప్రాబ్లం సాల్వ్. తనకు అవసరమైనప్పుడల్లా.. నల్లా తిప్పినట్టుగా.. ఆ టూత్ పేస్ట్ మూతను తెరిచి నీటిని పట్టుకుంటోంది. ఆ తర్వాత మళ్లీ మూత పెట్టి నీటిని ఆపేస్తోంది. ఈ విధంగా టాప్ సహాయం లేకుండా తానే ఒక టాప్ ను తయారుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకర్షించింది.
Harsh Goenka Post: ఇదే వీడియోను పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా తన X(ట్విట్టర్)లో ట్వీట్ చేశారు. దీనికి ఓ ఫన్నీ కామెంట్ కూడా జత చేశారు. "ట్యాప్స్ ఇన్ ఇండియా లైక్....#జుగాడ్" అని క్యాప్షన్ జోడించారు. దీంతో.. ఈ వీడియో మరోసారి వైరల్ అవుతోంది.