తమిళనాడులోని చిదంబరంలో ఓ ఉపాధ్యాయుడు తన విద్యార్థి పట్ల దారుణంగా ప్రవర్తించాడు. క్లాసులకు సరిగా రావడం లేదని విద్యార్థిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అతన్ని కింద పడేసి జుట్టు పట్టుకుని తీవ్రంగా కొడుతూ.. కాళ్లతో తంతూ హింసించాడు. అదే తరగతిలో ఉన్న మరో విద్యార్థి వీడియో తీయడం వల్ల ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలకు చెందిన సదరు విద్యార్థి క్లాసులకు సరిగా రావడం లేదనే సాకుతో ఆ టీచర్ కొట్టినట్లు సమాచారం.
ఈ హింసాత్మక ఘటనపై ఎంపీ కార్తీ చిదంబరం స్పందించారు. ఇలా కొట్టి హింసించడం సబబు కాదని.. ఆ టీచర్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు.
ఘటనకు సంబంధించి టీచర్‌పై దర్యాప్తునకు ఆదేశించినట్టు.. కడలూర్ జిల్లా కలెక్టర్ బాలసుబ్రహ్మణ్యం వెల్లడించారు.
ఇదీ చూడండి:- 15ఏళ్ల స్టూడెంట్‌తో రిలేషన్- గర్భవతి అయిన టీచర్ అరెస్ట్