ETV Bharat / bharat

వైరల్​ వీడియో- బైక్ పై ఎద్దును కూర్చోపెట్టి రైడింగ్​, నువ్వు గ్రేట్​ రా బాబు! - బైక్ పై ఎద్దు వైరల్​ వీడియో

Viral Video Man Takes Bull For Ride on Bike : సాధారణంగా ఎద్దులను లారీలు, డీసీఎం వాహనాల్లో తరలించడం చూస్తుంటాం. కానీ , ఇక్కడ ఓ వ్యక్తి వెరైటీగా ఎద్దును తన బైక్ పై కూర్చోపెట్టి తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Man Takes Bull For Ride In Bike Viral Video

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2023, 2:41 PM IST

Viral Video Man Takes Bull For Ride on Bike : స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగినప్పటినుంచి సోషల్ మీడియా వినియోగం కూడా రెట్టింపు అయ్యింది. ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా సులభంగా సోషల్ మీడియా ద్వారా తెలుసుకోగలుగుతున్నారు. అంతేకాకుండా అప్పుడప్పుడు కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో నిమిషాల్లో తెగ వైరల్​గా మారుతున్నాయి. ఈ వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవి ఉంటున్నాయి.

చాలా మంది పెంపుడు జంతువులను పెంచుకుంటారు. వాటి ఆలనా పాలన విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అంతే కాకుండా వాటితో కలిసి భోజనం చేయటం, ఒకే బెడ్‌పై నిద్రపోవడం, వాటిని హగ్​ చేసుకోవడం, వాటిని బైక్​ రైడింగ్​కి తీసుకెళ్లడం​ వంటి దృశ్యాలు కూడా చూశాం. తాజాగా అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

సాధారణంగా పిల్లులు, కుక్కలను.. బైక్, కార్లలో తీసుకెళ్లడం మనం చూసి ఉంటాం. కానీ, ఎక్కడ జరిగిందో ఏమో తెలియదు కానీ, ఓ వ్యక్తి ఏకంగా ఎద్దును తన బైక్ పై తీసుకెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ప్రస్తుతం వైరల్​ అవుతున్న ఈ వీడియోపై మనమూ ఓ లుక్కేద్దాం..

Viral Video : ఈ వీడియోలో ఓ వ్యక్తి తన బైక్ పై ఎద్దును ముందు కూర్చోబెట్టుకుని వేగంగా నడుపుతున్నాడు. అంత వేగంతో వెళ్తున్నా ఆ ఎద్దు.. ఎటూ కదలకుండా ముందు కూర్చుని అటూ ఇటూ చూస్తోంది. మామూలుగా ఎద్దు.. ఏదైనా పెద్ద వాహనంలో ఎక్కిస్తేనే.. అటు ఇటు కదలకుండా ఉంటుంది. కానీ, ఇక్కడ మాత్రం పూర్తి భిన్నంగా, ఎటువంటి భయం లేకుండా దర్జాగా కూర్చుంది.

నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఈ వీడియోను ఓ కారు డ్రైవర్ తన మొబైల్లో రికార్డ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోను నరేశ్ బహ్రెయిన్ (@nareshbahrain) అనే వ్యక్తి తన X(ట్విట్టర్​) ఖాతాలో పోస్ట్​ చేశాడు. ఈ వీడియోకు ఇప్పటివరకు రెండు లక్షలకు పైగా వ్యూస్​ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

'ప్రపంచంలో చాలా వింతలు చూడాల్సినవి ఉంటాయి. అందులో ఇది కూడా ఒకటి' అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది నెటిజన్లు మాత్రం ఇది నైజీరియాలో జరిగి ఉంటుందని.. అక్కడి ప్రజలే ఇలాంటి వింత పనులు చేస్తారని అంటున్నారు. మరికొంతమంది.. 'నువ్వు గ్రేట్ రా బుజ్జి', 'వీడు మాములోడు కాదు బయ్యా' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొకరైతే 'దీనినే బుల్ రైడింగ్' అంటారు అని ఫన్నీ కామెంట్ చేశారు. 'బైక్​లపై భారీ స్థాయిలో వస్తువులను తీసుకెళ్లడం, ఎక్కువమంది మనుషులను ఎక్కించి డ్రైవింగ్ చేస్తూ తీసుకెళ్లే వారిని చూసి ఉంటాం.. కానీ, ఎద్దును తీసుకెళ్లడం ఎంటండీ బాబు' అని మరికొద్దిమంది కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ వీడియో - వంట గదిలో కింగ్‌ కోబ్రా - పడగ విప్పిన పామును చేత్తో పట్టుకొని!

వైరల్ వీడియో - లెక్కలు చేస్తున్న కుక్క - పిల్లలకు ట్యూషన్ చెప్పేస్తదేమో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.