ETV Bharat / bharat

ఆక్సిజన్ లేక ఐసీయూకి తాళం.. ఎనిమిది మంది మృతి

author img

By

Published : May 6, 2021, 12:17 PM IST

Updated : May 6, 2021, 1:04 PM IST

అది దేశ రాజధాని దిల్లీ శివారులోని ఓ ప్రైవేటు ఆస్పత్రి.. అత్యవసర చికిత్స అందించే ఐసీయూకు తాళం ఉంది. అనుక్షణం రోగులను పర్యవేక్షించాల్సిన వైద్యులు కానీ.. ఇతర వైద్య సిబ్బంది కానీ ఏ ఒక్కరు ఆ దరిదాపుల్లో లేరు. అక్కడికి వెళ్లిన రోగుల బంధువులకు శ్మశానంలో ఉండే వాతావరణం కనిపించింది. అనుమానం వచ్చిన రోగుల బంధువులు ఐసీయూ తాళం తీసి.. అందులోని తమవారిని చూసి బోరున విలపించారు. అసలు ఆ ఆస్పత్రిలో ఏం జరిగింది.?

gurugram hospital
నిర్లక్ష్యానికి పరాకాష్ట..
ఆక్సిజన్ లేక ఐసీయూకి తాళం.. ఎనిమిది మంది మృతి

ఇది దేశ రాజధాని దిల్లీ శివారులోని గురుగ్రామ్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి. ఐసీయూలో చికిత్స పొందుతున్న కరోనా రోగులందరూ విగతజీవుల్లా మారారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. మొత్తం ఎనిమిది మంది ప్రాణవాయువు అందక ప్రాణాలువదిలారు. చనిపోయిన తమ వారిని చూసి వారి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దాదాపు వారంక్రితం అంటే శుక్రవారం జరిగిన ఈ ఘోరానికి సంబంధించిన దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

నిండుకున్న నిల్వలు..

గురుగ్రామ్​లోని క్రితి అనే ప్రైవేటు ఆస్పత్రిలో ఆరుగురు కరోనా రోగులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వారందరూ కృత్రిమశ్వాసపై ఉన్నారు. ఆస్పత్రిలో ప్రాణవాయువు నిల్వలు నిండుకోవటంతో.. వారిప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఒకేసారి ఆరుగురి శ్వాస ఆగిపోవటంతో.. వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది ప్రమాదాన్ని పసిగట్టారు. రోగుల బంధువులు వచ్చేలోగానే ఐసీయూకి తాళం వేసి అక్కడి నుంచి జారుకున్నారు.

తమవారిని చూసేందుకు ఆస్పత్రికి వచ్చిన బంధువులు.. భయంకరమైన నిశ్శబ్ద వాతావరణం చూసి ఆందోళన చెందారు. ఐసీయూకి తాళం చూసి వారి గుండె వేగం మరింత పెరిగింది. భయం భయంగా వెళ్లి.. ఐసీయకి వేసిన తాళంతీశారు. ప్రాణవాయువు అందక ప్రాణాలు కోల్పోయిన తమ వారిని చూసి గుండెలు బాదుకున్నారు.

పారిపోయిన వైద్యులు..

బాధితుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు ఆస్పత్రికి చేరుకోవటంతో.. అప్పటివరకూ కనిపించకుండాపోయిన వైద్యులు, ఇతరసిబ్బంది ప్రత్యక్షమయ్యారు. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తమవారు చనిపోయినట్లు బంధువులు ఆరోపించారు. అయితే.. ఐసీయూ వద్ద వైద్యులు, ఇతర సిబ్బంది లేకపోవటాన్ని ఆస్పత్రి యాజమాన్యం సమర్థించుకుంది. వారంతా ఎక్కడికి వెళ్లలేదని, దాడిచేస్తారన్న భయంతో.. ఆస్పత్రి ఆవరణలోని క్యాంటిన్‌లో దాక్కున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గతనెల 24న రోగుల బంధువులు కొందరు దాడిచేసిన నేపథ్యంలో.. ఐసీయూ నుంచి వెళ్లిపోవాలని వైద్యులు, ఇతర సిబ్బందికి తామే సూచించినట్లు పేర్కొన్నారు.

సమాచారమిచ్చినప్పటికీ..

గతనెల 30న తమ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ నిల్వలు నిండుకున్నాయని ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి అధికారులకు సమాచారం ఇస్తూనే ఉన్నట్లు యాజమాన్యం తెలిపింది. తమ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరత ఉన్నందున.. కరోనా రోగులను ఇతర ఆస్పత్రులకు తీసుకెళ్లాలని బంధువులకు కూడా సూచించినట్లు పేర్కొంది. రాత్రి 11 గంటల ప్రాంతంలో ప్రాణవాయువు అందక ఐసీయూలో చికిత్స పొందుతున్న ఎనిమిది మంది రోగులు ప్రాణాలు వదిలినట్లు ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది.

ఈ ఘటనపై కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా స్పందించారు. ఇవి ముమ్మాటికి హత్యలే అన్న ఆయన.. ఇది దాచిపెట్టే ప్రయత్నమంటూ ట్వీట్‌ చేశారు. ఐసీయూలో కరోనా రోగులు ప్రాణాలు వదిలిన వీడియోను ట్యాగ్‌ చేశారు.

ఈ ఘటనపై స్పందించిన గురుగ్రామ్​ అధికార యంత్రాంగం.. ఆరుగురి మరణానికి కారణమైన ప్రైవేటు ఆస్పత్రికి కరోనా చికిత్సకు అనుమతి లేదని తెలిపింది. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించినట్లు పేర్కొంది.

ఇవీ చదవండి: ఆక్సిజన్​ కొరతతో 11 మంది కొవిడ్ రోగులు మృతి

ఆక్సిజన్​ అందక 10 మంది రోగులు మృతి!

'అధికారుల్ని జైల్లో వేస్తే ఆక్సిజన్​ వస్తుందా?'

ప్రాణాలు పైప్​లైన్లలో!

Last Updated : May 6, 2021, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.